కరోనా దెబ్బ.. లోకల్ ట్రైన్లతో పాటు.. న్యూస్ పేపర్ కూడా బంద్..!

| Edited By:

Mar 23, 2020 | 6:27 PM

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాల్ని వణికిస్తోంది. దీని దెబ్బకు అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లే కుప్పకూలాయి. తాజాగా మనదేశంలో కూడా చాపకింద నీరులా వైరస్ వ్యాపిస్తోంది. ముఖ్యంగా దీని ప్రభావం మహారాష్ట్రలో విపరీతంగా ఉంది. ఇప్పటికే అక్కడ ఇద్దరు మృతిచెందారు కూడా. దీంతో మహా సర్కార్ కరోనాపై యుద్ధం ప్రకటించింది. వైరస్ వ్యాప్తి చెందకుండా ముంబై నగరంతో పాటు.. పలు జిల్లాల్లో లాక్‌డౌన్ ప్రకటించింది. దీంతో ముంబైలోని లోకల్ ట్రైన్స్‌తో పాటుగా.. అనేక సేవలు నిలిచిపోయాయి. ఇక ఈ […]

కరోనా దెబ్బ.. లోకల్ ట్రైన్లతో పాటు.. న్యూస్ పేపర్ కూడా బంద్..!
Follow us on

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాల్ని వణికిస్తోంది. దీని దెబ్బకు అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లే కుప్పకూలాయి. తాజాగా మనదేశంలో కూడా చాపకింద నీరులా వైరస్ వ్యాపిస్తోంది. ముఖ్యంగా దీని ప్రభావం మహారాష్ట్రలో విపరీతంగా ఉంది. ఇప్పటికే అక్కడ ఇద్దరు మృతిచెందారు కూడా. దీంతో మహా సర్కార్ కరోనాపై యుద్ధం ప్రకటించింది. వైరస్ వ్యాప్తి చెందకుండా ముంబై నగరంతో పాటు.. పలు జిల్లాల్లో లాక్‌డౌన్ ప్రకటించింది. దీంతో ముంబైలోని లోకల్ ట్రైన్స్‌తో పాటుగా.. అనేక సేవలు నిలిచిపోయాయి. ఇక ఈ వైరస్ ప్రభావం పత్రికలపై కూడా పడింది. సోమవారం పలు పత్రికల ముద్రణ కూడా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ముంబైలో కొనసాగుతున్న లాక్ డౌన్ ఎఫెక్ట్స్‌తో..హాకర్స్ న్యూస్ పేపర్ తీసుకు వెళ్లేందుకు ధైర్యం చేయకపోవడంతో.. పత్రికల ప్రింటింగ్ నిలిచిపోయినట్లు సమాచారం.
దీంతో పత్రికల యాజమాన్యాలు.. పాఠకులకు ఈ పేపర్, వెబ్‌సైట్ల ద్వారా వార్తలను చదువుకొండంటూ సలహాలిస్తున్నారు. దీనిపై అన్ని న్యూస్ పేపర్ల యాజమాన్యాలు మీటింగ్ పెట్టి ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర సరిహద్దుల్లో 144 సెక్షన్ కొనసాగిస్తున్నారు.