ధరలు పెంచితే ఏడేళ్ల జైలు.. నిత్యావసర వస్తు చట్టం అమలు..

|

Apr 09, 2020 | 2:11 PM

Coronavirus Lockdown: నిత్యావసర వస్తువుల పెరుగుదలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 1955 నిత్యావసర వస్తువుల చట్టం నిబంధనలను అమలులోకి తీసుకొచ్చింది. దేశంలో అమలవుతున్న లాక్ డౌన్ దృష్ట్యా ప్రజలకు నిత్యావసర వస్తువులకు కొరత లేకుండా తగిన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలను మోదీ సర్కార్ కోరింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్ భల్లా బుధవారం రాష్ట్ర ప్రభుత్వాల చీఫ్ సెక్రటరీలకు లేఖ రాశారు. బ్లాక్ మార్కెటింగ్, ధరలు పెంచితే […]

ధరలు పెంచితే ఏడేళ్ల జైలు.. నిత్యావసర వస్తు చట్టం అమలు..
Follow us on

Coronavirus Lockdown: నిత్యావసర వస్తువుల పెరుగుదలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 1955 నిత్యావసర వస్తువుల చట్టం నిబంధనలను అమలులోకి తీసుకొచ్చింది. దేశంలో అమలవుతున్న లాక్ డౌన్ దృష్ట్యా ప్రజలకు నిత్యావసర వస్తువులకు కొరత లేకుండా తగిన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలను మోదీ సర్కార్ కోరింది.

ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్ భల్లా బుధవారం రాష్ట్ర ప్రభుత్వాల చీఫ్ సెక్రటరీలకు లేఖ రాశారు. బ్లాక్ మార్కెటింగ్, ధరలు పెంచితే ఏడేళ్ల జైలు శిక్ష లేదా జరిమానా విధిస్తామని పేర్కొన్నారు. కొన్నిసార్లు అయితే రెండు శిక్షలతో కలిపి శిక్షించవచ్చునని తెలిపారు. ఇక ఈ చట్టాన్ని జూన్ 30 వరకు ప్రయోగించాలని కేంద్రం కోరింది. అటు కరోనా వల్ల అమలవుతున్న లాక్ డౌన్ ఈ నెల 14తో ముగియనున్న సంగతి తెలిసిందే.

నిత్యావసర వస్తు చట్టం 1955..

నిత్యావసర వస్తువుల నిల్వలపై పరిమితులు విధించడం, ధరల నిర్ధారించడం, ఉత్పత్తి పెంచడం, డీలర్ల ఖాతాలను తనిఖీ చేసే అధికారాన్ని ఈ చట్టం కల్పిస్తుంది. ఒకవేళ ఈ నిబంధనలను ఉల్లంఘించిన వ్యాపారులకు ఏడేళ్ల జైలు శిక్ష, జరిమానాను విధిస్తారు.

For More News:

ఆ మూడింటిని జూన్ వరకు బంద్ చేస్తారా..?

కరోనా కరాళ నృత్యం.. ప్రపంచవ్యాప్తంగా 15 లక్షలు దాటిన కేసులు..

దేశంలో 6 వేలకు చేరుతున్న పాజిటివ్ కేసులు.. ఏయే రాష్ట్రంలో ఎలా ఉందంటే..

‘తబ్లీఘీ జమాత్’ ఘటన.. కేంద్రం, అజిత్ దోవల్‌పై మహారాష్ట్ర హోంమంత్రి సంచలన వ్యాఖ్యలు..

కోహ్లీ అంటే ఆస్ట్రేలియా క్రికెటర్లకు భయం..

మద్యం అమ్మకాలకు అనుమతివ్వండి.. 10 రాష్ట్రాల సీఎంలకు లేఖలు..

కరోనా కల్లోలం.. అమెరికాలో ఒక్క రోజులోనే 1,940 మంది మృతి..

‘పుష్ప’కు ఆరో వేలు.. అసలు ట్విస్ట్ ఇదేనా..

గాంధీ ఆసుపత్రిలో కరోనా బాధితుల మెనూ ఇదే…