లాక్‌డౌన్‌: హైదరాబాద్ పోలీసుల సంచలన నిర్ణయం.. బయటికి వస్తే..!

| Edited By:

Apr 08, 2020 | 11:54 AM

కరోనా విస్తరణను అరికట్టేందుకు భారత ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ లాక్‌డౌన్‌ను కొంతమంది సరిగా పాటించడం లేదు. చిన్న చిన్న కారణాలు చెబుతూ రోడ్ల మీదకు వస్తున్నారు.

లాక్‌డౌన్‌: హైదరాబాద్ పోలీసుల సంచలన నిర్ణయం.. బయటికి వస్తే..!
Follow us on

కరోనా విస్తరణను అరికట్టేందుకు భారత ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ లాక్‌డౌన్‌ను కొంతమంది సరిగా పాటించడం లేదు. చిన్న చిన్న కారణాలు చెబుతూ రోడ్ల మీదకు వస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రోడ్ల మీదకు వస్తే బైక్‌ను స్వాధీనం చేసుకోనున్నారు. అత్యవసర కారణాల తప్ప మిగిలిన వారిని కట్టడి చేసేందుకు తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

కాగా లాక్‌డౌన్‌ విషయంలో కఠినంగా ఉన్నప్పటికీ.. ఎస్సార్‌నగర్‌, ఎర్రగడ్డ, అమీర్‌పేట, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, అమీర్‌పేట, పాతబస్తీ ప్రాంతాల్లో మంగళవారం వందల సంఖ్యలో వాహనాలు రోడ్లపైకి వచ్చాయి. దీన్ని తీవ్రంగా పరిగణించిన పోలీస్‌ ఉన్నతాధికారులు కమాండ్ కంట్రోల్ రూం ద్వారా ట్రాఫిక్‌ పోలీసులకు కీలక ఆదేశాలిచ్చారు. ఈ క్రమంలో కారణం లేకుండా తిరిగే బైక్‌లు, కార్లపై వచ్చిన వారిపై ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం కేసులు నమోదు చేసి వారి వాహనాలను స్వాధీనం చేసుకుంటామని పోలీసులు వెల్లడించారు.

Read This Story Also: కరోనాపై పోరుకు విరాళాలు.. ఏపీకి ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా..!