న్యూస్ పేపర్లను తెగ చదివేస్తున్నారట.. ఎంతసేపంటే?

కరోనా లాక్‌డౌన్ కారణంగా ప్రజలందరూ ఇళ్లల్లోనే ఉంటున్నారు. దీంతో ఖాళీగా ఏం చేయాలో తెలీక.. పలు రకాల ఆటలు ఆడుకుంటూ.. టీవీలు, ఫోన్లతో కాలక్షేపం చేస్తున్నారు. వాటితోనూ బోర్ కొడుతుండటంతో పుస్తకాలను, వార్తా పత్రికలను..

న్యూస్ పేపర్లను తెగ చదివేస్తున్నారట.. ఎంతసేపంటే?

Edited By:

Updated on: Apr 24, 2020 | 6:51 PM

కరోనా లాక్‌డౌన్ కారణంగా ప్రజలందరూ ఇళ్లల్లోనే ఉంటున్నారు. దీంతో ఖాళీగా ఏం చేయాలో తెలీక.. పలు రకాల ఆటలు ఆడుకుంటూ.. టీవీలు, ఫోన్లతో కాలక్షేపం చేస్తున్నారు. వాటితోనూ బోర్ కొడుతుండటంతో పుస్తకాలను, వార్తా పత్రికలను తెగ చదివేస్తున్నారట. న్యూస్ పేపర్లను చదివే సమయం భారీగా పెరిగిందని తాజాగా పలువురు నిపుణులు చేసి సర్వేలో వెల్లడైంది. ఎన్నడూ న్యూస్‌పేపర్‌ వైపు చూడని వాళ్లు కూడా ఈ లాక్‌డౌన్ వల్ల వాటివైపు మొగ్గుచూపుతున్నారట.

గతంతో పోలిస్తే దినపత్రిక ఎక్కువ సమయం చదువుతున్నారని తేలింది. గతంలో ఒక్కొక్కరు సగటున అరగంటకి పైగా న్యూస్ పేపర్‌ చదివితే.. ఇప్పుడు పొద్దుపోక ఏకంగా రెండు గంటల దాకా చదివేస్తున్నారట. గతంలో 16 శాతం మంది మాత్రమే గంట సమయం పత్రికలు చదివే వారట. కానీ ఇప్పుడు ఆ సంఖ్య 38 శాతానికి పెరిగిందట. 72 శాతం మంది రోజులు 30 నిమిషాలు పత్రికలు చదువుతుంటే.. గతంలో ఇది 42 శాతం మాత్రమే ఉండేది. అలాగే ఇంకొంతమంది ప్రజలు కేవలం 15 నిమిషాలు మాత్రమే పత్రికలు చదువుతున్నారని సర్వే తేలినట్లు నిపుణులు వెల్లడించారు.

Read More: 

అక్షయ తృతీయ బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయితో బంగారాన్ని కొనుగోలు చేసుకోవచ్చు!

హైపర్‌ ఆది పెళ్లి డేట్ ఫిక్స్.. అమ్మాయిది ఏ జిల్లా అంటే!

సీఎం కేసీఆర్‌కు ఆర్జీవీ దిమ్మతిరిగే ఛాలెంజ్..

గుడ్‌న్యూస్: వాట్సాప్‌లో ఒకేసారి 8 మందితో వీడియో కాలింగ్