ఫేస్‌బుక్‌ నుంచి మరో సరికొత్త యాప్.. ఫ్రీ గేమింగ్!

| Edited By:

Apr 21, 2020 | 4:31 PM

ఫేస్‌బుక్ ఓ గేమింగ్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. వినియోగదారులకు ఉచితంగా ఈ యాప్‌ను అందించనుంది. ప్రస్తుతం ఈ యాప్‌ను ఆండ్రాయిడ్ ఫోన్లలోకి అందుబాటులోకి తీసుకొచ్చింది ఫేస్‌బుక్ సంస్థ. ఇక యాపిల్ సంస్థ నుంచి ఆమోదం లభిస్తే త్వరలో..

ఫేస్‌బుక్‌ నుంచి మరో సరికొత్త యాప్.. ఫ్రీ గేమింగ్!
Follow us on

కరోనా వైరస్‌ను అడ్డుకునేందుకు ప్రపంచ దేశాలు కట్టుదిట్టంగా లాక్‌డౌన్ అమలు చేస్తున్నాయి. దీని వల్ల ఎవరూ బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో దాదాపు ఖాళీగా ఉన్నవారు సోషల్ మీడియాలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. పలు ఎంటర్ టైన్‌మెంట్ షోలు, వీడియో గేమ్‌లు ఆడుతూ సమయాన్ని గడుపుతున్నారు. ఈ తరుణంలో ఫేస్‌బుక్ ఓ గేమింగ్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. వినియోగదారులకు ఉచితంగా ఈ యాప్‌ను అందించనుంది.

ప్రస్తుతం ఈ యాప్‌ను ఆండ్రాయిడ్ ఫోన్లలోకి అందుబాటులోకి తీసుకొచ్చింది ఫేస్‌బుక్ సంస్థ. ఇక యాపిల్ సంస్థ నుంచి ఆమోదం లభిస్తే త్వరలో ఐఓఎస్ వెర్షన్‌లోనూ ఈ గేమింగ్ యాప్‌ను విడుదల చేయనుంది. అలాగే దీన్ని ఎలా ఉపయోగించాలో కూడా ఫేస్‌బుక్ గేమింగ్ యాప్ డైరెక్టర్ ఫిద్జీ సిమో తెలిపారు. ఈ యాప్‌లో గో లైవ్ అనే ఫీచర్‌ను ఉపయోగించడం ద్వారా వినియోగదారులు ఇతర మొబైల్ గేమ్స్ స్ట్రీమ్‌లను అప్‌లోడ్ చేసుకోవచ్చు.

కాగా ఈ గేమింగ్ యాప్ కొన్ని సాధారణ ఆటలను కలిగి ఉన్నప్పటికీ ప్రధానంగా లైవ్ స్ట్రీమ్‌లనే కలిగి ఉంటుంది. అంతేకాకుండా ముఖ్యంగా ఈ యాప్ ప్రారంభంలో ఎటువంటి ప్రకటనలు ఉండవని ఫేస్‌బుక్ ప్రతినిధులు తెలిపారు. లాటిన్ అమెరికా, ఆగ్రేసియాలో 18 నెలలుగా ఫేస్‌బుక్ ఈ యాప్ వెర్షన్‌లను పరిక్షిస్తోంది.

Read More: 

జగన్ ప్రభుత్వం వల్ల రూ.1400 కోట్లు వృథా.. కన్నా సంచలన వ్యాఖ్యలు

పవన్‌తో సినిమా నేను చేయలేను.. జక్కన్న సెన్సేషనల్ కామెంట్స్

చరిత్రలో మొదటిసారిగా మైనస్‌లోకి చమురు ధరలు.. పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..

భక్తులకు శుభవార్త.. ఇకపై ఆన్‌లైన్‌లో దివ్య దర్శనం