లాక్‌డౌన్‌ 2.0: మోదీపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసలు

| Edited By:

Apr 14, 2020 | 8:25 PM

21రోజుల పాటు లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటికీ.. దేశంలో కరోనా వైరస్‌ అదుపులోకి రాలేదు. ఈ నేపథ్యంలో ఈ లాక్‌డౌన్‌ను మరో 19 రోజుల పాటు కొనసాగించబోతున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు.

లాక్‌డౌన్‌ 2.0: మోదీపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసలు
Follow us on

21రోజుల పాటు లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటికీ.. దేశంలో కరోనా వైరస్‌ అదుపులోకి రాలేదు. ఈ నేపథ్యంలో ఈ లాక్‌డౌన్‌ను మరో 19 రోజుల పాటు కొనసాగించబోతున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. మోదీ ప్రకటించిన ఈ నిర్ణయానికి విపక్షాల నుంచి కూడా మద్దతు లభించింది. ఇదిలా ఉంటే భారత్‌లో లాక్‌డౌన్ పొడిగింపుపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో ) స్పందించింది. ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం గొప్పదని డబ్ల్యూహెచ్‌వో సౌత్‌ ఈస్ట్ ఏసియా రీజనల్ డైరక్టర్ డా.పూనమ్‌ ఖేత్రాపాల్ సింగ్‌ అన్నారు.

కరోనాపై పోరు విషయంలో భారత్‌.. సరైన సమయంలో సరైన చర్యలు తీసుకుంటుందని ఆమె తెలిపారు. లాక్‌డౌన్ ఫలితాల గురించి ముందే మాట్లాడటం అంత కరెక్ట్ కాకపోయినా.. ఆరు వారాల లాక్‌డౌన్‌ వలన ఈ వైరస్‌ వ్యాప్తిని చాలా వరకు అరికట్టవచ్చని ఆమె అన్నారు. భారత్ విషయంలో ఆ ఫలితాలను చూడబోతున్నామని పేర్కొన్నారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ.. కరోనాపై పోరు విషయంలో భారత్‌ తీసుకుంటున్న నిర్ణయాలు నిజంగా అభినందించదగ్గవని పేర్కొన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరు సాధ్యమైన చర్యలు తీసుకోవాలని ఆమె అన్నారు. కాగా కరోనా వైరస్‌పై భారత్ తీసుకోంటున్న చర్యలపై గతంలోనూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. కాగా దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తాజాగా 10వేలను దాటేయగా.. 353 మంది మృత్యువాతపడ్డారు.

Read This Story Also: అర్హులైన వారికి ఐదు రోజుల్లోనే రేషన్ కార్డు: మంత్రి బొత్స