Covid 4th wave: భారత్‌లో స్వల్పంగా తగ్గిన కరోనా ఉద్ధృతి.. ప్రపంచ దేశాల్లో ఆగని కల్లోలం..

|

Jul 12, 2022 | 10:40 AM

వరుసగా రెండో రోజు దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 16,000ల కంటే తక్కువ నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు (జులై 12)న విడుదల చేసిన గణాంకాలు తెల్పుతున్నాయి..

Covid 4th wave: భారత్‌లో స్వల్పంగా తగ్గిన కరోనా ఉద్ధృతి.. ప్రపంచ దేశాల్లో ఆగని కల్లోలం..
Covid Updates
Follow us on

Coronavirus LIVE Updates: వరుసగా రెండో రోజు దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 16,000ల కంటే తక్కువ నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు (జులై 12)న విడుదల చేసిన గణాంకాలు తెల్పుతున్నాయి. ఆదివారం (జులై 10) 16,678 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదుకాగా, 42 మంది మృతి చెందారు. గడచిన 24 గంటల్లో (సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు) 13,615 కొత్త కోవిడ్‌ కేసులు నమోదుకాగా, 20 మంది కరోనాతో మృతి చెందారు. 13,275 మంది కోలుకున్నారు. దీంతో దేశంలో యాక్టివ్‌ కేసులు మొత్తం 1,31,043 ఉన్నట్లు తాజా గణాంకాలు వెల్లడించాయి. ఇక డైలీ పాజిటివిటీ రేటు 3.23శాతంగా ఉండగా, రికవరీ రేటు 98.50శాతం ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెల్పింది.

ప్రపంచదేశాల్లో కొత్తగా 5,72,560 మంది వైరస్​ బారినపడ్డారు. మరో 1,157 మంది మహమ్మారితో ప్రాణాలు విడిచారు. ఇప్పటివరకు కరోనాతో 63,74,666 మంది మృతి చెందారు. జర్మనీలో అత్యధికంగా 1,54,729 మంది కొత్తగా కరోనా బారిన పడ్డారు. 165 మంది మృతి చెందారు. అమెరికా​లో నిన్న ఒక్క రోజులోనే 57,970 మందికి కోవిడ్‌సోకగా, 122 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక జపాన్​​లో 50,918 కొత్త కేసులు వెలుగుచూశాయి. 10 మంది మృతి చెందారు. బ్రెజిల్​లో 44,043 మంది వైరస్​ బారిన పడగా, 155 మంది మరణించారు. ఇటలీలో కొత్తగా 37,756ల మందికి కరోనా సోకింది.