
మహారాష్ట్రలో కరోనా మహ్మమారి మరింత విజృంభిస్తోంది. క్రమక్రమంగా కేసులు పెరుగుతూ.. పదివేల కేసులకు చేరుకుంటుంది. అంతేకాదు..కరోనా బారినపడి మరణాలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా బుధవారం నమోదైన కేసులు వివరాలను అధికారులు విడుదల చేశారు. బుధవారం ఒక్కరోజే 32 మంది కరోనా మహమ్మారి బారిన పడి ప్రాణాలు
కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. ఇక కొత్తగా ఇవాళ ఒక్కరోజే 597 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపారు. దీంతో.. మహారాష్ట్రలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 9,915కి చేరింది. ముఖ్యంగా ముంబై, పూణె. థానే నగరాల్లో కరోనా మహమ్మారి ప్రభావం ఎక్కువగా ఉంది. ఇక కరోనా నుంచి బయటపడి.. బుధవారం
205 మంది డిశ్చార్జ్ అయినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1593కు చేరింది. కాగా.. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారిరనడి 432 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువగా ముంబై ప్రాంతంలోనే మరణించడం కలకలం రేపుతోంది. దేశంలో నమోదవుతున్న కేసుల్లో ఎక్కువగా.. మహారాష్ట్ర నుంచి
నమోదవ్వడం.. సంచలనంగా మారుతోంది. ప్రభుత్వం మరింత కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది.