గడిచిన 24 గంటల్లో దేశంలో నమోదైన కేసుల వివరాలు ఇవే..

| Edited By:

May 07, 2020 | 10:28 PM

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు ముప్పై తొమ్మిది లక్షల కేసులు నమోదవ్వగా.. వీరిలో కేవలం పన్నెండు లక్షల మంది మాత్రమే కరోనా నుంచి కోలుకున్నారు. మరో రెండున్నర లక్షలకు పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక మనదేశంలో కూడా కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన కొద్దిరోజులుగా నిత్యం వెయ్యికిపైగా కేసులు నమోదవుతున్నాయి. తాజగా గడిచిన 24 గంటల్లో నమోదైన కేసులు చూస్తే షాక్ […]

గడిచిన 24 గంటల్లో దేశంలో నమోదైన కేసుల వివరాలు ఇవే..
Follow us on

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు ముప్పై తొమ్మిది లక్షల కేసులు నమోదవ్వగా.. వీరిలో కేవలం పన్నెండు లక్షల మంది మాత్రమే కరోనా నుంచి కోలుకున్నారు. మరో రెండున్నర లక్షలకు పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక మనదేశంలో కూడా కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన కొద్దిరోజులుగా నిత్యం వెయ్యికిపైగా కేసులు నమోదవుతున్నాయి. తాజగా గడిచిన 24 గంటల్లో నమోదైన కేసులు చూస్తే షాక్ తినాల్సిందే. గురువారం నాడు నమోదైన కరోనా కేసుల వివరాలు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంత్రి హర్షవర్దన్ వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3561 కేసులు నమోదయ్యాయని తెలిపారు. బుధవారం నుంచి గురవారం వరకు మొత్తం 1084 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని పేర్కొన్నారు. ఇక ఇతర దేశాలతో పోల్చితే.. మన దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు బాగుందని.. మరణాల రేటు కూడా చాలా తక్కువ ఉందని మంత్రి అన్నారు. దేశంలోప్రస్తుతం రికవరీ రేటు 28.83 శాతంగా ఉండగా.. మరణాల రేటు 3.3గా ఉందన్నారు.

కాగా.. దేశంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా.. మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాల్లో కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి.