బ్రేకింగ్‌.. దేశంలో కరోనా@50వేలు.. మూడు రోజుల్లో నమోదైన కేసులు చూస్తే షాక్..

| Edited By:

May 06, 2020 | 8:40 PM

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తొలుత పదులు వందల సంఖ్యలో ఉన్న కేసులు వేలల్లోకి వెళ్లిపోయాయి. తాజాగా ఇప్పుడు యాభై వేల మార్క్‌ను దాటింది. అయితే గడిచిన మూడు రోజుల్లోనే పది వేల కొత్త కేసులు నమోదవ్వడం కలకలం రేపుతోంది. బుధవారం నాడు దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 50వేలకు చేరింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా బుధవారం నాటికి నమోదైన కేసుల సంఖ్య 50545కి చేరింది. ఈ కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్ర […]

బ్రేకింగ్‌.. దేశంలో కరోనా@50వేలు.. మూడు రోజుల్లో నమోదైన కేసులు చూస్తే షాక్..
Follow us on

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తొలుత పదులు వందల సంఖ్యలో ఉన్న కేసులు వేలల్లోకి వెళ్లిపోయాయి. తాజాగా ఇప్పుడు యాభై వేల మార్క్‌ను దాటింది. అయితే గడిచిన మూడు రోజుల్లోనే పది వేల కొత్త కేసులు నమోదవ్వడం కలకలం రేపుతోంది. బుధవారం నాడు దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 50వేలకు చేరింది.

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా బుధవారం నాటికి నమోదైన కేసుల సంఖ్య 50545కి చేరింది. ఈ కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచే నమోదయ్యాయి. కాగా ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 14వేలకు చేరింది. ఇక కరోనా బారినపడి ప్రాణాలుకోల్పోయిన వారి సంఖ్య 1650కి చేరింది. దేశ వ్యాప్తంగా
కఠినంగా లాక్‌డౌన్ నిబంధనలు అమలు చేస్తున్నప్పటికీ.. పలు రాష్ట్రాల్లో కేసులు సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్‌తో పాటు పలు రాష్ట్రాల్లో కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది. ఇక కేరళ వంటి రాష్ట్రాల్లో తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం కేరళలో ముప్పై మాత్రమే యాక్టివ్ కేసులు ఉన్నట్లు సీఎం పినరయ్  విజయన్ పేర్కొన్నారు.