India Coronavirus updates: భారత్‌లో కరోనా వ్యాప్తి నానాటికీ పెరుగుతూనే ఉంది. గత 24గంటల్లో గురువారం దేశవ్యాప్తంగా 9,309 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ వైరస్ కారణంగా 87 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,08,80,603 కి చేరగా.. మరణాల సంఖ్య 1,55,447 కి పెరిగింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ శుక్రవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. దీంతోపాటు నిన్న కరోనా నుంచి 15,858 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు 1,05,89,230 మంది బాధితులు కోవిడ్ నుంచి కోలుకున్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది.
ప్రస్తుతం దేశంలో 1,35,926 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 97.32 శాతానికి చేరగా.. మరణాల రేటు 1.43 శాతంగా ఉంది. నిన్న దేశవ్యాప్తంగా 7,65,944 కరోనా పరీక్షలు చేశారు. ఇదిలాఉంటే.. భారత్‌లో కరోనావైరస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం వరకు 75,05,010 మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చినట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది.
Also Read: