India Coronavirus Cases: దేశంలో గత కొన్ని రోజులుగా దడపుట్టిస్తున్న కరోనా వైరస్ మెల్ల మెల్లగా తగ్గుముఖం పడుతోంది. నిన్న 3.40 లక్షలకుపైగా కేసులు నమోదవగా, తాజాగా 3.26 లక్షలకు దిగివచ్చాయి. అయితే మృతుల సంఖ్య మాత్రం క్రమంగా పెరుగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా గడిచిన24 గంటల వ్యవధిలో కొత్తగా 3,26,098 కేసులు నమోదయ్యాయి. మరో 3,890 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,43,72,907కు చేరింది. ఇందులో 2,04,32,898 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
ఇదిలావుంటే, ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ ఆసుపత్రుల్లో 36,73,802 కేసులతో యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా ఇప్పటి వరకు దేశంలో కరోనా మహమ్మారి బారినపడి 2,66,207 మంది బాధితులు ప్రాణాలను కోల్పోయారు. నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు కొత్తగా 3,53,299 మంది బాధితులు డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. మరోవైపు, కరోనా కట్టడిలో భాగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 18,04,57,579 మందికి వ్యాక్సిన్ పంపిణీ చేశామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
India reports 3,26,098 new #COVID19 cases, 3,53,299 discharges and 3,890 deaths in the last 24 hours, as per Union Health Ministry
Total cases: 2,43,72,907
Total discharges: 2,04,32,898
Death toll: 2,66,207
Active cases: 36,73,802Total vaccination: 18,04,57,579 pic.twitter.com/qvAExjSPxE
— ANI (@ANI) May 15, 2021
కాగా, దేశంలో మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 31,30,17,193కు చేరిందని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్) ప్రకటించింది. నిన్న ఒకేరోజు 16,93,093 మందికి పరీక్షలు నిర్వహించామని వెల్లడించింది.
Read Also… Cyclone Tauktae: తీరంలో అలజడి.. భీకరంగా మారుతున్న తుఫాను.. బుసలు కొడుతున్న తౌక్తా