కరోనాతో నిండు గర్భిణి మృతి

| Edited By:

Apr 07, 2020 | 12:02 PM

దాదాపుగా ప్రపంచమంతా విస్తరించిన కరోనా ఇప్పటికే 70వేల మందికి పైగా ప్రాణాలను తీసుకుంది. కొన్ని లక్షల మంది ఈ మహమ్మారిన బారిన పడగా.. వారందరూ అలుపెరగని పోరాటం చేస్తున్నారు.

కరోనాతో నిండు గర్భిణి మృతి
Follow us on

దాదాపుగా ప్రపంచమంతా విస్తరించిన కరోనా ఇప్పటికే 70వేల మందికి పైగా ప్రాణాలను తీసుకుంది. కొన్ని లక్షల మంది ఈ మహమ్మారిన బారిన పడగా.. వారందరూ అలుపెరగని పోరాటం చేస్తున్నారు. తాజాగా ఈ వైరస్‌ బారిన పడి తొమ్మిది నెలల నిండు గర్భిణి మృత్యువాతపడింది. ముంబయిలోని నల్లసోపోరా ప్రాంతానికి చెందిన ఓ మహిళ శ్వాస తీసుకోవడంతో తీవ్ర ఇబ్బంది ఎదుర్కోగా.. శనివారం రాత్రి ఆమెను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితిని చూసి కరోనాగా అనుమానించిన వైద్యులు.. కరోనా నిర్ధారణ పరీక్ష చేయడంతో పాటు.. ఐసోలేషన్‌ వార్డుకు తరలించి, అత్యవసర చికిత్స అందించారు.

అయితే ఆమె పరిస్థితి మరింత దిగజారి, కొన్ని గంటల్లోనే మృతి చెందింది. ఆమె గర్బంలోని శిశువు కూడా మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఆ తరువాత వెలువడిన ఫలితాల్లో ఆమెకు కరోనాగా నిర్ధారణ అయింది. దీంతో ఆమె కుటుంబసభ్యులకు కరోనా పరీక్షలు చేయబోతున్నట్లు సమాచారం.

Read This Story Also: కరోనా నిధుల కోసం WHO లైవ్‌.. భాగం కానున్న భారతీయ నటులు వీరే..!