Breaking News
  • దేశంలో కొనసాగుతున్న కరోనా విజృంభన గడచిన 24 గంటల్లో అత్యధికంగా 24, 879 పాజిటివ్ కేసులు నమోదు కాగా 487 మంది మృతి. దేశంలో కరోన బాధితుల సంఖ్య 7, 67, 296 చేరినట్లు ప్రకటించిన కేంద్ర ఆరోగ్య శాఖ. 2, 69, 789 మందికి కొనసాగుతున్న చికిత్స. కరోన నుండి ఇప్పటి వరకు కోలుకున్న 4, 76, 378 మంది బాధితులు. కోవిడ్-19వైరస్ సోకి ఇప్పటివరకు 21, 129 మంది మృతి.
  • విజయవాడ: ఈ నెల 20 నుంచి ప్రథమ్ మొబైల్ యాప్ ద్వారా ఆర్టీసీ బస్సుల్లో టికెట్లు జారీ. నగదు రహిత లావాదేవీల ద్వారా టికెట్లు జారీ ని ప్రారంబించాలని ఆర్టీసీ నిర్ణయం. తొలుత ప్రయోగాత్మకంగా 19 డిపోల పరిధిలో మొబైల్ యాప్ ద్వారా టికెట్ల జారీ చేయాలని ఎండీ నిర్ణయం.
  • టీవీ9 తో కోవిడ్ 19 కమాండ్ కంట్రోల్ స్పెషలాఫీసర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి. గాలిలో కరోనా వైరస్ వ్యాపించదు. భౌతిక దూరం పాటిస్తే సరిపోతుంది. దగ్గినప్పుడు తుమ్మినప్పుడు తుంపర్లు మీద పడకుండా ఉండే దూరంలో ఉంటే సరిపోతుంది. వైరస్ సోకిన వాళ్ళు వెంటనే ఆసుపత్రికి రావాలి. సీరియస్ అయినప్పుడు వస్తే రికవరీ కావడం కష్టం అందుకే డెత్ డేట్ స్వల్పంగా పెరిగింది. వైరస్ వచ్చిన వాళ్లకు ముఖ్యమంత్రి హోమ్ ఐసోలేషన్ సౌకర్యం కల్పించారు. 55 సంవత్సరాల వయసు పైబడిన డాక్టర్లు ఎవ్వరు డ్యూటీకి రావడం లేదు. టెలిమెడిసిన్ సౌకర్యానికి వారందరినీ ఉపయోగించుకుంటాం. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఫీజులను ఏపీలో కూడా ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఆసుపత్రులకు ఇచ్చేలా ముఖ్యమంత్రి ఆదేశించారు.
  • పెరుగుతున్న కరోనాకేసుల్తో మార్కెట్లలో బెంబేలు . ఈనెల 12వ తేదీ నుండి కొత్తపేట్ గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ ను మూసివేత నిర్ణయం. మళ్లీ ప్రకటించే వరకూ రైతులు ఎవరు మార్కెట్ రావద్దని ప్రకటన. వేల సంఖ్యలో రైతులతో కిటకిట లాడే మార్కెట్లో నిబంధనలు పాటించడంలేదంటూ ఆందోళన. కోవిడ్ నిబంధనలు పాటించకపోవడంతో మూసివేత నిర్ణయం తీసుకున్న కమిటి. ప్రతి రోజు 5వందల నుంచి వేయి టన్నుల పండ్ల అమ్మకాలు . 250 మంది వ్యాపారులు...3వందల మంది హమాలీలతో ఉన్న గడ్డి అన్నారం మార్కెట్.
  • నిమ్స్ లోని నెఫ్రాలజీ లో డయాలసిస్ పేషెంట్స్ ఆందోళన. డయాలసిస్ చేయడం లేదంటూ నిమ్స్ వద్ద నిరసన . డయాలసిస్ కోసం పేర్లు కూడా రిజిస్టర్ చేసుకోవడం లేదు అంటూ ఆందోళన . గంటలు తరబడి లైన్లో నిలుచున్నా పట్టించుకునే వారు లేరంటూ ఆవేదన . వారానికి నాలుగు సార్లు చేయవలసిన డయాలసిస్ మూడు సార్లే చేస్తున్నారు. 4 గంటలు నిర్వహించాల్సిన డయాలసీస్ 3 గంటలే చేస్తున్నారంటున్న పేషంట్లు . సకాలంలో డయాలసీస్ చేయకపోతే ప్రాణాలు పోతాయంటూ ఆందోళన.
  • విశాఖ: కేజీహెచ్ వైరాలజీ ల్యాబ్ లో కరోనా కలకలం. టెస్ట్ లు నిర్బహించే ముగ్గురు టెక్నీషియన్లకు కరోనా పాజిటివ్. ల్యాబ్ లో సేవలందించే 20 మందికి పరీక్షలు.. అందరికీ నెగెటి. వైరాలజీ ల్యాబ్ లో సేవలు తాత్కాలికంగా నిలిపివేత.. ల్యాబ్ లో శానిటైజ్ చేస్తున్న జీవీఎంసీ సిబ్బంది. ప్రత్యామ్నాయంగా కేజీహెచ్ లోని నాకో ల్యాబ్ ను వినియోగిస్తున్న వైద్య సిబ్బంది.

కరోనా నిధుల కోసం WHO లైవ్‌.. భాగం కానున్న భారతీయ నటులు వీరే..!

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోన్న కరోనాను ఎలాగైనా కట్టడి చేయాలని దేశాధినేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పలు దేశాలు లాక్‌డౌన్‌ను ప్రకటించాయి.
coronavirus relief fund, కరోనా నిధుల కోసం WHO లైవ్‌.. భాగం కానున్న భారతీయ నటులు వీరే..!

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోన్న కరోనాను ఎలాగైనా కట్టడి చేయాలని దేశాధినేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పలు దేశాలు లాక్‌డౌన్‌ను ప్రకటించాయి. ఈ మహమ్మారికి సోకకుండా ఉండేందుకు ఇంట్లో నుంచి బయటకు రాకపోవడమే ఉత్తమమని వారు సూచిస్తున్నారు. మరోవైపు కరోనాపై ఎప్పటికప్పుడు దేశాలను అప్రమత్తం చేస్తోన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO)ఈ వైరస్‌పై పోరుకు నిధులను సేకరించే పనిలో పడింది. ఈ క్రమంలో టాప్ సెలబ్రిటీలతో ఈ నెల 18న లైవ్ ఈవెంట్ పెట్టేందుకు సిద్ధమైంది.

coronavirus relief fund, కరోనా నిధుల కోసం WHO లైవ్‌.. భాగం కానున్న భారతీయ నటులు వీరే..!

ఈ ఈవెంట్‌లో జాన్ లెజండ్, లేడి గాగా, డేవిడ్ బెక్‌హమ్‌, ఎల్టన్ జాన్, ఐడ్రిస్ ఎల్బా తదితరులు భాగం కానున్నారు. వారితో పాటు భారత్‌ నుంచి కింగ్‌ఖాన్ షారూక్ ఖాన్, దేవీ గర్ల్‌ ప్రియాంక చోప్రా ఈ కార్యక్రమంలో పాలుపంచుకోబోతున్నారు. ఇక ఈ షోకు ప్రపంచ ప్రఖ్యాతగాంచిన స్టీఫెన్ కోల్బర్ట్, జిమ్మి ఫెలోన్‌, జిమ్మీ కిమ్మెల్ వ్యాఖ్యాతలుగా పనిచేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ కార్యక్రమానికి WHO ఒక ప్రపంచం: ఇంటి వద్ద కలిసి(One World: Together at home)అనే క్యాప్షన్‌ను పెట్టింది. కాగా భారత్‌లోనూ కరోనాపై అవగాహన తీసుకొచ్చేందుకు అమితాబ్ బచ్చన్, చిరంజీవి, రజనీకాంత్, మమ్ముట్టి, మోహన్ లాల్, రణ్‌బీర్ కపూర్, అలియా, ప్రియాంక తదితరులు కలిసి ఫ్యామిలీ అనే ఓ లఘు చిత్రంలో నటించిన విషయం తెలిసిందే.

Read This Story Also: తబ్లీగి జామాత్‌: హకీంపేట మజీదు ఇన్‌చార్జిపై క్రిమినల్ కేసు

Related Tags