భారత్‌లో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ప్రముఖ సింగర్ కనికా కపూర్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. గత ఆదివారం కనికా బ్రిటన్ నుంచి దేశానికి తిరిగి వచ్చారు. అయితే ఈ విషయాన్ని ఆమె గోప్యంగా ఉంచారు. ఇక్కడకు వచ్చిన తరువాత ఓ స్టార్ హోటల్‌లో ఉంటూ ఇటీవల ఆమె ఓ విందుకు హాజరయ్యారు. ఆ విందులో దాదాపు 100మంది పాల్గొన్నట్లు సమాచారం. దీంతో కనికా ఎక్కడెక్కడ తిరిగారు..? ఆమె పాల్గొన్న విందులో ఎవరెవరు పాల్గొన్నారు అనే వివరాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే దేశంలో కరోనా బాధితుల సంఖ్య 200కు దగ్గరగా ఉండగా.. ఐదుగురు మృత్యువాతపడ్డారు.