ప్రపంచ వ్యాప్తంగా కరోనా విళయ తాండవం.. మృతుల సంఖ్య చూస్తే షాక్..

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విళయతాండవం చేస్తోంది. క్రమక్రమంగా మృతుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఏకంగా వారం రోజుల లోపే 25వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారంటే.. ఈ వైరస్ ఎంతలా విజృంభిస్తుందో అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19 బారినపడి మరణించిన వారి సంఖ్య 75వేలు దాటింది. ఈ విషయాన్ని ఏఎఫ్‌పీ మీడియా సంస్థ వెల్లడించింది. ఇక ఈ వైరస్‌ బారినపడ్డ వారి సంఖ్య 13 లక్షలకు పైగా ఉంది. ఇటలీ, స్పెయిన్, అమెరికాలో […]

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విళయ తాండవం.. మృతుల సంఖ్య చూస్తే షాక్..
Follow us

| Edited By:

Updated on: Apr 07, 2020 | 9:50 PM

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విళయతాండవం చేస్తోంది. క్రమక్రమంగా మృతుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఏకంగా వారం రోజుల లోపే 25వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారంటే.. ఈ వైరస్ ఎంతలా విజృంభిస్తుందో అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19 బారినపడి మరణించిన వారి సంఖ్య 75వేలు దాటింది. ఈ విషయాన్ని ఏఎఫ్‌పీ మీడియా సంస్థ వెల్లడించింది. ఇక ఈ వైరస్‌ బారినపడ్డ వారి సంఖ్య 13 లక్షలకు పైగా ఉంది. ఇటలీ, స్పెయిన్, అమెరికాలో ఈ వైరస్ ప్రభావం విపరీతంగా ఉంది. ఈ మూడు ప్రాంతాల్లో 10వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇటలీలో అత్యధికంగా 16 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోగా.. స్పెయిన్‌లో 13 వేలు దాటింది. ఇక అమెరికాలో 10వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. ఫ్రాన్స్‌లో8 వేలమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.