సిక్కోలులో తొలి కరోనా మరణం

|

Jun 17, 2020 | 4:20 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. బుధవారం ఏకంగా కోవిడ్ పాజిటివ్ కేసులు మూడు సెంచరీలు దాటేశాయి. శ్రీకాకుళం జిల్లాలోనూ తొలి కరోనా మరణం నమోదైంది. దీంతో అప్ర‌మ‌త్త‌మైన‌ అధికారులు మంద‌స ప‌ట్ట‌ణాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా ప్ర‌క‌టించారు.

సిక్కోలులో తొలి కరోనా మరణం
Follow us on

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. బుధవారం ఏకంగా కోవిడ్ పాజిటివ్ కేసులు మూడు సెంచరీలు దాటేశాయి. మొత్తం 15,188 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 351 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో 275 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 51 మందికి.. విదేశాల నుంచి వచ్చినవారిలో 23 మందికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. కాగా ఏపీలో మొత్తం 7,071కి కరోనా పాజిటివ్ కేసులు చేరుకున్నాయి. 90 మంది మృతి చెందారు. ఇదిలా ఉంటే, శ్రీకాకుళం జిల్లాలోనూ తొలి కరోనా మరణం నమోదైంది. దీంతో అప్ర‌మ‌త్త‌మైన‌ అధికారులు మంద‌స ప‌ట్ట‌ణాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా ప్ర‌క‌టించారు.

శ్రీకాకుళం జిల్లా మందసం మండల కేంద్రంలో కరోనాతో బాధపడుతున్న 37 ఏళ్ల యువకుడు బుధవారం మృతిచెందినట్లు జిల్లా క‌లెక్ట‌‌ర్ జె.నివాస్ వెల్లడించారు. కరోనా మృతి కారణంగా ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. కాగా, మ‌ర‌ణించిన వ్య‌క్తికి ఎలాంటి ట్రావెల్ హిస్ట‌రీ లేనప్పటికీ,…. కేవలం సంక్ర‌మ‌ణ ద్వారానే అత‌డికి క‌రోనా వ్యాపించిందని అధికారులు వెల్ల‌డించారు. ఇప్ప‌టివ‌ర‌కు జిల్లాలో 400 క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు న‌మోదైనట్లు తెలిపారు. ఇందులో 271 యాక్టివ్ కేసులున్నాయి. దీంతో కేసుల దృష్ట్యా ఒక్క శ్రీకాకుళం ప‌ట్ట‌ణంలోనే 10 కంటైన్‌మెంట్ జోన్లు ఏర్పాటు చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.

మరోవైపు రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా కరోనా కేసుల గుర్తింపు కోసం చేస్తున్న టెస్టుల సంఖ్యను మరింత పెంచింది. గడిచిన 24 గంటల్లో 15,188 టెస్టులు చేయగా.. ఇప్పటి వరకు 5,98,474 టెస్టులు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 5555 కేసులు నమోదు కాగా, దీనికి అదనంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 1253 మంది కరోనా బారినపడ్డారు.