మే 4 నుంచి భారీ స్థాయిలో లాక్‌డౌన్ సడలింపులు: కేంద్ర హోంశాఖ

| Edited By:

Apr 30, 2020 | 7:24 AM

మే 4వ తేదీ నుంచి భారీ స్థాయిలో లాక్‌డౌన్ నిబంధనల్లో సడలింపులు ఉండనున్నాయని కేంద్ర హోంశాఖ ప్రకటన విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన లాక్‌డౌన్ మే 3తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో మే 4 నుంచి లాక్‌డౌన్‌లో కొన్ని మినహాయింపులు ఉంటాయని..

మే 4 నుంచి భారీ స్థాయిలో లాక్‌డౌన్ సడలింపులు: కేంద్ర హోంశాఖ
Telangana Lockdown
Follow us on

మే 4వ తేదీ నుంచి భారీ స్థాయిలో లాక్‌డౌన్ నిబంధనల్లో సడలింపులు ఉండనున్నాయని కేంద్ర హోంశాఖ ప్రకటన విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన లాక్‌డౌన్ మే 3తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో మే 4 నుంచి లాక్‌డౌన్‌లో కొన్ని మినహాయింపులు ఉంటాయని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. అయితే ఆ నిబంధనలు ఎలా ఉంటాయి? అవి ఏంటనేది త్వరలో తెలియజేయనుంది. నిన్న రాత్రి హోమ్ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ వల్ల అనేక లాభాలు చేకూరాయని, వాటిని కొనసాగించడానికి మే 3 వరకూ లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా పాటించాలన్నారు.

మే 4వ తేదీ నుంచి కొత్త మార్గదర్శకాలు అమల్లోకి వస్తాయని, సాధ్యమైనంతమేర, మెజారిటీ జిల్లాల్లో లాక్‌డౌన్‌కి సంబంధించిన నిబందనల సడలింపు ఉంటుందని, త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను బయటపెడతామని అన్నారు. దీని బట్టి చూస్తుంటే గ్రీన్ జోన్లలో లాక్‌డౌన్‌కి అధిక మినహాయింపులు ఇస్తూనే.. రెడ్‌ జసోన్లో మాత్రం లాక్‌డౌన్ మరింత కట్టు దిట్టంగా అమలు చేసే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది.

Read More: 

గుడ్‌న్యూస్: వడ్డీ లేకుండా అప్పు.. కానీ షరతులు వర్తిస్తాయి!

మే 3 తరువాత పెళ్లి చేసుకునే వారికి ఈ రూల్స్ తప్పనిసరి