కరోనా విలయతాండవం.. ప్రపంచవ్యాప్తంగా పెరిగిన కేసులు..!

| Edited By:

Apr 23, 2020 | 9:07 AM

ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండం కొనసాగుతోంది. చాలా దేశాల్లో లాక్‌డౌన్ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా వ్యాప్తి మాత్రం ఆగడం లేదు.

కరోనా విలయతాండవం.. ప్రపంచవ్యాప్తంగా పెరిగిన కేసులు..!
Follow us on

ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం కొనసాగుతోంది. చాలా దేశాల్లో లాక్‌డౌన్ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా వ్యాప్తి మాత్రం ఆగడం లేదు. మొత్తం 210 దేశాలకు ఈ వైరస్‌ విస్తరించగా.. కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 26, 37,790కు చేరింది. వీరిలో 1,84,230 మంది మృత్యువాతపడగా.. 7,17,819 మంది కోలుకున్నారు. ఇక దేశాల వారీగా అగ్రరాజ్యం అమెరికాలో 8,49,271పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వారిలో 84,050 మంది కోలుకోగా.. 47,693 మంది మరణించారు. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష దాటిన దేశాల్లో అమెరికా తరువాత స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, లండన్‌ దేశాలు ఉన్నాయి. అలాగే 50వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైన దేశాల జాబితాలో టర్కీ, ఇరాన్‌, చైనా, రష్యా దేశాలు కొనసాగుతున్నాయి. ఇక వైరస్‌ పుట్టిన చైనాలో మొన్నటివరకు తగ్గినట్లే కనిపించిన కరోనా.. ఇప్పుడు మళ్లీ విజృంభిస్తోంది. ఆ దేశంలో ప్రస్తుతం 82,802కేసులు ఉన్నాయి. ఇక భారతదేశంలో 21,370 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Read This Story Also: మరింత ఉధృతం కానున్న కరోనా.. సీడీసీ హెచ్చరిక..!