వరల్డ్ అప్డేట్: కరోనా కేసులు @ 74 లక్షలు… 4.19 లక్షల మరణాలు..

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ బాధితుల సంఖ్య 7,482,561 చేరింది. అటు గడిచిన 24 గంటల్లో ఏకంగా 5165 మంది చనిపోయారు. ఇప్పటివరకు కరోనా బారిన పడి 419,489 మంది ప్రాణాలు కోల్పోగా..

వరల్డ్ అప్డేట్: కరోనా కేసులు @ 74 లక్షలు… 4.19 లక్షల మరణాలు..

Updated on: Jun 11, 2020 | 4:36 PM

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి 213 దేశాలకు పాకింది. గంట గంటకూ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. అమెరికాలో అయితే కరోనా మరణ మృదంగం వాయిస్తోంది. ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ బాధితుల సంఖ్య 7,482,561 చేరింది. అటు గడిచిన 24 గంటల్లో ఏకంగా 5165 మంది చనిపోయారు. ఇప్పటివరకు కరోనా బారిన పడి 419,489 మంది ప్రాణాలు కోల్పోగా.. 3,798,125 మంది కోలుకున్నారు. అగ్రరాజ్యం అమెరికా, రష్యా, బ్రెజిల్, స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాల్లో ఈ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. అత్యధిక కేసులు(2,066,611), మరణాలు(115,140) అమెరికాలో నమోదయ్యాయి. కాగా, ఇండియాలో ఇప్పటివరకు 287,679 కేసులు నమోదు కాగా.. 8,115 మృతి చెందారు. కాగా, ఇండియాలో యాక్టివ్ కేసుల కంటే రికవరీ అవుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటం కాస్త ఊరటను ఇచ్చే అంశం అని చెప్పాలి.

కరోనా తీవ్రత ఎక్కువ ఉన్న దేశాల లిస్ట్…

  • అమెరికా – 2,066,611 కేసులు, 115,140 మరణాలు
  • బ్రెజిల్ – 775,184 కేసులు, 39,797 మరణాలు
  • రష్యా – 502,436 కేసులు, 6,532 మరణాలు
  • బ్రిటన్ – 290,143 కేసులు, 41,128 మరణాలు
  • స్పెయిన్ – 289,360 కేసులు, 27,136 మరణాలు
  • ఇండియా – 287,679 కేసులు, 8,115 మరణాలు
Loading...
Unable to load recommendations.
Follow Us