యూరప్‌ దేశాల్లో కరోనా విజృంభణ.. 15లక్షలు దాటేసిన కేసులు..!

యూరప్‌ దేశాల్లో కరోనా విజృంభణ.. 15లక్షలు దాటేసిన కేసులు..!

యూరప్‌ దేశాల్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తాజాగా ఆ దేశాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 15లక్షలు దాటేసింది.

TV9 Telugu Digital Desk

| Edited By:

May 02, 2020 | 5:31 PM

యూరప్‌ దేశాల్లో కరోనా విజృంభణ ఆగడం లేదు. ప్రస్తుతం ఆ దేశాల్లో శీతాకాలం ఉండటంతో.. వైరస్ వ్యాప్తి వేగంగా విస్తరిస్తోంది. తాజాగా ఆ దేశాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 15లక్షలు దాటేసింది. ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. ఈ వైరస్ విస్తరణ కొనసాగుతూనే ఉంది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 33 లక్షలను దాటేసింది. డిసెంబర్‌లో కరోనా విస్తరణ చైనాలో ప్రారంభం కాగా.. ఇప్పటివరకు 2,35,519 మంది ఈ మహమ్మారితో ప్రాణాలను వదిలారు. 10 లక్షలకు పైగా ఈ వైరస్‌ నుంచి కోలుకున్నారు. కరోనా విస్తరణ నేపథ్యంలో పలు దేశాలు లాక్‌డౌన్‌ను కొనసాగిస్తున్నాయి. జూన్ లేదా జూలై వరకు పలు దేశాల్లో లాక్ డౌన్ కొనసాగే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Read This Story Also: పవన్ సినిమా కోసం ఆ యంగ్ హీరోను సంప్రదించలేదట..!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu