ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయ తాండవం.. 85 లక్షలకు చేరువలోకి కేసులు..

| Edited By:

Jun 18, 2020 | 9:20 PM

కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విలయ తాండవం సృష్టిస్తోంది. ఈ మహమ్మారి వైరస్‌కు చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ లేకపోవడంతో.. రోజురోజుకు లక్షల్లో కేసులు పెరుగుతున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయ తాండవం.. 85 లక్షలకు చేరువలోకి కేసులు..
Follow us on

కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విలయ తాండవం సృష్టిస్తోంది. ఈ మహమ్మారి వైరస్‌కు చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ లేకపోవడంతో.. రోజురోజుకు లక్షల్లో కేసులు పెరుగుతున్నాయి. కేసుల తీవ్రతను బట్టి చూస్తుంటే.. మరో పది రోజుల్లోనే కోటి మార్క్‌ను చేరుకునేలా కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 84,85,414 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఇక కరోనా నుంచి కోలుకుని 44,46,469 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 3,586,573 మంది చికిత్స పొందుతున్నారు. ఇక కరోనబారినపడి ఇప్పటి వరకు 4,52,372 మంది మరణించారు.

ఇక ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న కేసుల్లో అత్యధికంగా అగ్రరాజ్యం నుంచే నమోదవుతున్నాయి. ఇక్కడ ఇప్పటికే 2,239,259 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య కూడా అమెరికాలోనే ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇప్పటికే ఇక్కడ 1.20 లక్షల మందికి పైగా కరోనా బారినపడి మరణించారు. ఆ తర్వాత బ్రెజిల్, రష్యా, భారత్‌లలో అధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. యూకే, స్పెయిన్, పెరు, ఇటలీ, చీలీ దేశాల్లో రెండు లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.