
గోషామహల్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు కరోనా టెన్షన్ పట్టుకుంది. ఆయన దగ్గర ఉండే పలువురు సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన కారు నడిపే ఇద్దరు డ్రైవర్లకు కరోనా పాజిటివ్ వచ్చింది. అంతేకాదు.. మరో ముగ్గురు గన్‌మెన్స్‌కు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన దగ్గర పనిచేస్తున్న వారంతా భయపడుతున్నారు. ఇప్పటికే రాజాసింగ్ కూడా కరోనా పరీక్షలు చేయించుకోగా.. ఆయనకు నెగిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ నెల 20న తన దగ్గర పనిచేస్తున్న మరో ఐదుగురికి కూడా కరోనా పరీక్షలు చేయించారు రాజాసింగ్. అయితే వీరి రిపోర్టులు రావాల్సి ఉందని ఆయన తెలిపారు. మొత్తానికి కరోనా మహమ్మారి సామాన్యుడి నుంచి మొదలు.. ప్రజాప్రతినిధులందర్నీ వణికిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో పది వేల మార్క్ దాటింది. రాష్ట్రంలో పెరుగుతున్న కేసుల్లో.. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నుంచే నమోదవుతున్నాయి.