నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలో కరోనా కేసు !

|

Mar 10, 2020 | 2:33 PM

భారత్‌లో అడుగుపెట్టిన కరోనా భూతం..తెలుగు రాష్ట్రాల్లోనూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఎక్కడో ఓ చోట కరోనా అనుమానిత కేసులు నమోదు అవుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా ....

నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలో కరోనా కేసు !
Follow us on

భారత్‌లో అడుగుపెట్టిన కరోనా భూతం..తెలుగు రాష్ట్రాల్లోనూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఎక్కడో ఓ చోట కరోనా అనుమానిత కేసులు నమోదు అవుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా అనుమానిత కేసు నమోదు కావడంతో ప్రజల్లో మరింత ఆందోళన మొదలైంది. నెల్లూరు చిన్నబజారుకు చెందిన వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అయితే, ఆ వ్యక్తి రెండు రోజుల కిందట ఇటలీ నుంచి నెల్లూరుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. వైరస్ లక్షణాలు కనిపించటంతో ముందుగా కుటుంబ సభ్యులు అతడని ఆస్పత్రిలో చేర్పించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో కరోనా వైరస్ బాధితుల కొరకు ప్రత్యేకించి ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ వార్డులో డాక్టర్లు అతడికి చికిత్స అందిస్తున్నారు.