CORONA SECOND WAVE HITS INDIA TWELVE STATES WORST: దేశంలో కరోనా మహమ్మారి (CORONA VIRUS) అంతకంతకూ విస్తరిస్తుంది. ప్రతిరోజూ లక్షల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఫస్ట్ వేవ్ (FIRST WAVE) కంటే సెకండ్ వేవ్ (SECOND WAVE) లో కేసులు అత్యధికంగా పెరుగుతున్నాయి. గత నాలుగు రోజులుగా రోజుకు నాలుగు లక్షలకుపైగా కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు (CORONA POSITIVE CASES) వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర (MAHARASHTRA) సహా మొత్తం 12 రాష్ట్రాల్లో ఈ మహమ్మారి ప్రభావం అత్యధికంగా ఉన్నది. దేశం మొత్తంలో ఉన్న యాక్టివ్ కేసుల్లో ఆ 12 రాష్ట్రాల్లోనే 80 శాతానికిపైగా కేసులు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం (UNION GOVERNMENT) తెలిపింది.
దేశం మొత్తంలో ప్రస్తుతం 37 లక్షల కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. అందులో 80.68 శాతం కేసులు కేవలం 12 రాష్ట్రాల నుంచే ఉన్నాయి. అందులో మహారాష్ట్రలో అత్యధికంగా 6 లక్షల 57 వేల కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కర్ణాటక (KARNATAKA) 5 లక్షల 36 వేల కరోనా యాక్టివ్ కేసులతో రెండో స్థానంలో ఉంది. కేరళ (KERALA)లో 2 లక్షల 54 వేల కరోనా యాక్టివ్ కేసులు ఉండగా… ఉత్తరప్రదేశ్ (UTTAR PRADESH) రాష్ట్రంలో 1 లక్షా 99 వేల కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఆ తర్వాత స్థానంలో రాజస్థాన్ (RAJASTHAN) ఉంది. ఈ ఐదు రాష్ట్రాలతోపాటే మరో ఏడు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ (ANDHRA PRADESH), గుజరాత్ (GUJARAT), తమిళనాడు (TAMILNADU), ఛత్తీస్‌గఢ్ (CHATTISGARH), పశ్చిమ బెంగాల్ (WEST BENGAL), హర్యానా (HARYANA), బీహార్ (BIHAR) రాష్ట్రాలలో అత్యధికంగా కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
కొత్త కేసుల్లో కూడా కేవలం 10 రాష్ట్రాల నుంచే 70.77 శాతం కేసులు ఉన్నాయి. అదేవిధంగా దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య సుమారు 2.23 కోట్లకు చేరువైంది. అందులో మరణాల రేటు 1.09 శాతంగా ఉన్నది. కరోనా వైరస్‌తో చనిపోతున్నవారిలో మహారాష్ట్ర ప్రథమ స్థానంలో వుంది. ఆ రాష్ట్రంలో అత్యధికంగా 898 మంది, కర్ణాటకలో 592 మంది, ఉత్తరప్రదేశ్‌లో 372 మంది, ఢిల్లీ (DELHI)లో 341మంది మరణించారు. ఓ రకంగా చెప్పాలంటే.. దేశంలో కరోనా మహమ్మారి మరణ మృదంగం మోగిస్తున్నది. వరుసగా రెండో రోజూ (మే 9న) నాలుగు వేలకుపైగా బాధితులు మరణించారు. గత 15 రోజులుగా ప్రతిరోజూ మూడు వేలకుపైగా మరణాలు సంభవిస్తున్నాయి. ఇప్పుడు ఆ సంఖ్య నాలుగు వేలు దాటింది. రోజువారీ కేసులు వరుసగా నాలుగో రోజు కూడా నాలుగు లక్షలు దాటాయి. దీంతో మొత్తం కేసులు 2.23 కోట్లకు చేరువలో నిలిచాయి.
దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో (మే 8న సాయంత్రం దాకా) కొత్తగా 4 లక్షల 3 వేల 626 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా 4వేలకు పైగా వైరస్ వల్ల కన్నుమూశారు. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 2 కోట్ల 22 లక్షల 95 వేల 911లకు చేరగా, మృతులు 2 లక్షల 42 వేల 398కు చేరింది. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో మహారాష్ట్రలో అత్యధికంగా 53 వేల 605 కేసులు ఉండగా 864మంది మరణించారు. కర్ణాటకలో 47 వేల 563 కరోనా బారినపడగా 482 మంది చనిపోగా… కేరళలో 41 వేల 971 పైగా కేసులు నమోదు కాగా 300పైగా చనిపోయారు.