ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. ఒక్క రోజులో ఎన్ని కేసులంటే.!

|

Sep 20, 2020 | 6:11 PM

ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,738 పాజిటివ్ కేసులు, 57 మరణాలు సంభవించాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 6,25,514కి చేరింది.

ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. ఒక్క రోజులో ఎన్ని కేసులంటే.!
Follow us on

ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,738 పాజిటివ్ కేసులు, 57 మరణాలు సంభవించాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 6,25,514కి చేరింది. వీటిల్లో 78,836 యాక్టివ్ కేసులు ఉండగా.. 5,41,319 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 5359కి చేరుకుంది. (Coronavirus In Andhra Pradesh)

అటు గడిచిన 24 గంటల్లో 10,608 మంది సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. నిన్న ఒక్క రోజే తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1260 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత పశ్చిమగోదావరిలో 1005 కేసులు నమోదయ్యాయి. ఇక అనంతపురం 539, చిత్తూర్ 794, గుంటూరు 582, కడప 267, కృష్ణ 439, కర్నూలు 275, నెల్లూరు 444, శ్రీకాకుళం 476, విజయనగరం 446, ప్రకాశంలో 869, విశాఖపట్నం 342 కేసులు నమోదయ్యాయి. కాగా, తూర్పుగోదావరిలో అత్యధికంగా 86,507 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. చిత్తూరులో 587 కరోనా మరణాలు సంభవించాయి.

Also Read:

మందుబాబులకు మరో గుడ్ న్యూస్.. ఏపీలో బార్లకు గ్రీన్ సిగ్నల్..

శభాష్ సాయి తేజ్.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సుప్రీమ్ హీరో..