Big Breaking:దేశంలో మరో కరోనా డెత్.. తెలంగాణలో 22కు చేరిన పాజిటివ్ కేసులు

భారత్‌లో మరో కరోనా డెత్ నమోదైంది. పాట్నాలో 38ఏళ్ల ఓ వ్యక్తి కరోనాతో మరణించాడు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య 6కు చేరింది.

Big Breaking:దేశంలో మరో కరోనా డెత్.. తెలంగాణలో 22కు చేరిన పాజిటివ్ కేసులు

Edited By:

Updated on: Mar 22, 2020 | 1:36 PM

భారత్‌లో మరో కరోనా డెత్ నమోదైంది. పాట్నాలో 38ఏళ్ల ఓ వ్యక్తి కరోనాతో మరణించాడు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య 6కు చేరింది. ఇటీవల ఖతర్ నుంచి దేశానికి వచ్చిన అతడికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు ఎయిమ్స్‌ సూపరిటెండెంట్ సీఎం సింగ్ ధృవీకరించారు. బీహార్‌లోని ముంగూర్ జిల్లాకు చెందిన అతడు.. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ శుక్రవారం ఆసుపత్రిలో చేరినట్లు ఆయన వెల్లడించారు. ఆ తరువాత అతడికి కరోనా లక్షణాలు ఉండటంతో శాంపిల్స్‌ను పరీక్షల నిమిత్తం పంపారు. అయితే ఈ లోపే శనివారం రాత్రి అతడు మరణించగా.. ఆదివారం వచ్చిన రిపోర్టులో కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలిందని సీఎం సింగ్ తెలిపారు. మరోవైపు తెలంగాణలో మరో పాజిటివ్ కేసు నమోదైంది. గుంటూరుకు చెందిన 24ఏళ్ల యువకుడికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. అతడు లండన్ నుంచి దుబాయి మీదుగా హైదరాబాద్ చేరుకున్నట్లు తెలుస్తోంది. దీంతో బాధితుల సంఖ్య 22కు చేరింది.

Read This Story Also: వారిపై చర్యలు తీసుకోండిః కేటీఆర్‌కు సింగర్ సునీత విఙ్ఞప్తి