తెలంగాణలో కొత్తగా 873 పాజిటివ్ కేసులు, 4 మరణాలు.. రెండు లక్షల యాభై వేలు దాటిన రికవరీలు..

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 873 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,63,526కి చేరింది.

  • Publish Date - 9:06 am, Sun, 22 November 20
తెలంగాణలో కొత్తగా 873 పాజిటివ్ కేసులు, 4 మరణాలు.. రెండు లక్షల యాభై వేలు దాటిన రికవరీలు..

Corona Cases In Telangana: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 873 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,63,526కి చేరింది. ఇందులో 11,643 యాక్టివ్ కేసులు ఉండగా.. 2,50,453 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు గడిచిన 24 గంటల్లో 1,296 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, నలుగురు మరణించారు. దీనితో రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 1430కి చేరింది. ఇక నిన్న ఒక్క రోజే 41,646 శాంపిల్స్ పరీక్షించగా.. మొత్తంగా టెస్టుల సంఖ్య 51,34,335కి చేరింది.

జిల్లాల వారీగా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదిలాబాద్ 8, భద్రాద్రి కొత్తగూడెం 58, జీహెచ్ఎంసీ 152, జగిత్యాల 36, జనగాం 8, జయశంకర్ భూపాలపల్లి 10, గద్వాల్ 4, కామారెడ్డి 11, కరీంనగర్ 44, ఖమ్మం 29, ఆసిఫాబాద్ 2, మహబూబ్ నగర్ 20, మహబూబాబాద్ 13, మంచిర్యాల 22, మెదక్ 10, మేడ్చల్ 78, ములుగు 18, నాగర్ కర్నూల్ 13, నల్గొండ 47, నారాయణపేట 2, నిర్మల్ 4, నిజామాబాద్ 13, పెద్దపల్లి 22, రాజన్న సిరిసిల్ల 18, రంగారెడ్డి 71, సంగారెడ్డి 27, సిద్ధిపేట 18, సూర్యాపేట 22, వికారాబాద్ 5, వనపర్తి 8, వరంగల్ రూరల్ 10, వరంగల్ అర్బన్ 56, యదాద్రి భువనగిరిలో 14 కేసులు నమోదయ్యాయి.

Also Read:

మాస్క్ లేకుంటే రూ. 2 వేలు భారీ జరిమానా.. నోటిఫికేషన్ జారీ చేసిన సర్కార్…

రోజుకు గరిష్టంగా 12 గంటలు.. వారానికి 48 గంటలు.. కార్మిక శాఖ కొత్త ప్రతిపాదన..

ఆరేళ్లుగా వీడని మిస్టరీ కేసు.. నిందితులను పట్టిస్తే రూ. 5 లక్షల డాలర్ల రివార్డు.!

వచ్చే ఐపీఎల్‌కు చెన్నై జట్టు భారీ మార్పులు.. ఆ ఐదుగురిపై వేటు తప్పదు.. లిస్టులో ధోని.!