Corona Cases In India: దేశంలో కరోనా వైరస్ మళ్లీ పంజా విసురుతోంది. గత నెల రోజు క్రితం తగ్గుముఖం పట్టిన మహమ్మారి ఇప్పుడు మళ్లీ విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా రోజువారీ కేసుల్లో గణనీయ పెరుగుదల నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 26,291 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఈ ఏడాదిలో 26వేల పైన కేసులు నమోదవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. కొద్ది రోజులుగా దక్షిణాఫ్రికా, బ్రిటన్ రకం కరోనా వైరస్‌లు దేశంలో వ్యాపిస్తుండటంతో కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తోంది.
దీనితో దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 1,13,85,339కు చేరింది. ఇందులో 2,19,262 యాక్టివ్ కేసులు ఉండగా, 1,10,07,352 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న 118 మంది కరోనాతో మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 1,58,725కు చేరుకుంది. నిన్న కొత్తగా 17,455 మంది దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్రలో కోవిడ్ ఉద్ధృతి విపరీతంగా ఉంది. గత కొద్దిరోజులుగా అక్కడ రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం ఈ కేసుల సంఖ్య ఏకంగా 16వేలు దాటింది. నిన్న అక్కడ 16,620 మంది వైరస్ బారిన పడగా.. 50 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా మొత్తం 2.19లక్షల యాక్టివ్ కేసులున్నాయి. ఒక్క మహారాష్ట్రలోనే 1,26,231 క్రియాశీల కేసులుండటం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసులు విచ్చలవిడిగా పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి మహారాష్ట్ర సర్కార్ ముందస్తు చర్యలు చేపడుతోంది. నాగ్‌పూర్ సహా కొన్ని జిల్లాల్లో మళ్లీ లాక్‌డౌన్ విధించింది.
Yadadri: వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి.. మరికాసేపట్లో విశ్వక్సేనుడి పూజ..
India vs England: అరంగేట్ర మ్యాచ్‌లోనే దంచికొట్టేశాడు.. కెప్టెన్ అండతో దుమ్ములేపాడు.. ఇషాన్ కిషన్ బ్యాటింగ్ పవర్ చూపించాడు
Two-Day Bank Strike: సమ్మెబాట పట్టిన జాతీయ బ్యాంకులు.. సోమ, మంగళవారాల్లో బంద్..