ఏపీలో కరోనా టెర్రర్ సృష్టిస్తోంది. రోజురోజుకీ పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. తాజాగా ఏపీలో కొత్తగా 264 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. వీరిలో రాష్ట్రానికి చెందిన వారు 193 మంది కాగా, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 44 మంది, విదేశాలకు చెందినవారు 27 మంది కరోనా వైరస్ బారినపడ్డారు. తాజాగా ఇద్దరు కరోనాతో చనిపోయారు. చిత్తూరు జిల్లాలో ఒకరు, ప్రకాశం జిల్లాలో ఒకరు మరణించారు. ఇక తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5280కి చేరింది. అలాగే 2851 మంది కోవిడ్ నుంచి కోలుకోగా.. యాక్టివ్ కేసుల సంఖ్య 2341గా ఉంది. ఇప్పటివరకూ రాష్ట్రంలో వైరస్‌తో చనిపోయిన వారి సంఖ్య 88కి పెరిగింది. రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతుండటం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో పెద్ద ఎత్తున కరోనా టెస్టులు నిర్వహిస్తోంది.
#COVIDUpdates: As on 16th June, 10:00AM
COVID Positives: 5280
Discharged: 2851
Deceased: 88
Active Cases: 2341#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/z1hdfwhGW4— ArogyaAndhra (@ArogyaAndhra) June 16, 2020
Read More: