మరో అన్నాడీఎంకే ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్..

| Edited By:

Jul 05, 2020 | 5:36 PM

కోయంబత్తూర్ సౌత్ ఎమ్మెల్యే అమ్మాన్ కే అర్జున్‌ (58)కి ఆదివారం కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. దీంతో వెంటనే ఆయన్ని ఐసోలేషన్ కేంద్రానికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు అధికారులు. ఇక ఎమ్మెల్యే అమ్మాన్ కే అర్జున్ కుటుంబ సభ్యులకు కూడా వైద్యులు...

మరో అన్నాడీఎంకే ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్..
Follow us on

తమిళనాడులో కరోనా వైరస్ విలయ తాండవం సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. అందులోనూ తమిళనాడు రాజధాని చెన్నైలో కోవిడ్ మరింత భయంకరంగా వ్యాప్తి చెందుతుంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో తమిళనాడు ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. ముఖ్యంగా పలువురు ప్రజాప్రతినిధులు, వైద్యులు, ప్రభుత్వ సిబ్బంది, పోలీసులు, నటులపై కూడా ఈ వైరస్ ప్రభావం చూపిస్తోంది. తాజాగా మరో అన్నాడీఎంకే ఎమ్మెల్యే అమ్మాన్ కే అర్జున్‌కి కరోనా పాజిటివ్‌ నిర్థారణ అయింది. దీంతో ఇప్పటివరకూ ఐదుగురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలకు కరోనా సోకింది.

కోయంబత్తూర్ సౌత్ ఎమ్మెల్యే అమ్మాన్ కే అర్జున్‌ (58)కి ఆదివారం కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. దీంతో వెంటనే ఆయన్ని ఐసోలేషన్ కేంద్రానికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు అధికారులు. ఇక ఎమ్మెల్యే అమ్మాన్ కే అర్జున్ కుటుంబ సభ్యులకు కూడా వైద్యులు కరోనా టెస్టులు చేస్తున్నారు. ఇటీవలే కుటుంబంతో కలిసి మధురైలోని ఓ కార్యక్రమానికి హాజరయ్యారు అన్నాడీఎంకే ఎమ్మెల్యే. అక్కడి నుంచి వచ్చిన తరువాత నుంచి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనకి కోవిడ్ టెస్టులు చేయగా.. కరోనా ఉన్నట్లు నిర్థారణ అయింది.

కాగా తమిళనాడు రాష్ట్రం కరోనా పాజిటివ్ కేసుల విషయంలో దేశవ్యాప్తంగా రెండో స్థానంలో ఉంది. ప్రస్తుతం తమిళనాడులో 1,07,001 కేసులు నమోదవ్వగా, 1450 మంది మరణించారు. ఇక 44,959 యాక్టీవ్‌ కేసులు ఉండగా, 60,592 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

Read More: 

బ్రేకింగ్: నెహ్రూ జూపార్కులో రాయల్ బెంగాల్ టైగర్ మృతి

కరోనా ఎఫెక్ట్: నెల్లూరులో మూతపడ్డ పోలీస్ స్టేషన్

నాగాలాండ్‌లో కుక్క మాంసం బ్యాన్..