కరోనా పుట్టిన దేశంలో వ్యాక్సిన్‌ ట్రయల్స్ మరింత వేగవంతం..

కరోనా మహమ్మారికి పుట్టినిల్లైన చైనాలో ప్రస్తుతం వైరస్ ఆనవాళ్లు తగ్గిపోయిన విషయం తెలిసిందే. అంతేకాదు ఇప్పడు అక్కడ అనేక ప్రాంతాల్లో కరోనాకు విరుగుడు వ్యాక్సిన్‌ కోసం ప్రయత్నాలు వేగవంతమయ్యాయి. గత మార్చి నెలలోనే ఓ ల్యాబరేటరీ క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతిని కూడా తీసుకుని ప్రయత్నాలు స్టార్ట్ చేసింది. ప్రస్తుతం మూడో కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ని రెండోదశ క్లినికల్‌ ట్రయల్స్‌కు అనుమతించినట్టు చైనా ప్రకటించింది. చైనా సైన్యానికి చెందిన సంస్థ.. డెవలప్ చేసిన వ్యాక్సిన్‌ సహా.. ఇప్పటి వరకు […]

కరోనా పుట్టిన దేశంలో వ్యాక్సిన్‌ ట్రయల్స్ మరింత వేగవంతం..

Edited By:

Updated on: Apr 26, 2020 | 9:23 PM

కరోనా మహమ్మారికి పుట్టినిల్లైన చైనాలో ప్రస్తుతం వైరస్ ఆనవాళ్లు తగ్గిపోయిన విషయం తెలిసిందే. అంతేకాదు ఇప్పడు అక్కడ అనేక ప్రాంతాల్లో కరోనాకు విరుగుడు వ్యాక్సిన్‌ కోసం ప్రయత్నాలు వేగవంతమయ్యాయి. గత మార్చి నెలలోనే ఓ ల్యాబరేటరీ క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతిని కూడా తీసుకుని ప్రయత్నాలు స్టార్ట్ చేసింది. ప్రస్తుతం మూడో కరోనా వైరస్‌
వ్యాక్సిన్‌ని రెండోదశ క్లినికల్‌ ట్రయల్స్‌కు అనుమతించినట్టు చైనా ప్రకటించింది.

చైనా సైన్యానికి చెందిన సంస్థ.. డెవలప్ చేసిన వ్యాక్సిన్‌ సహా.. ఇప్పటి వరకు చైనాలో కరోనా వైరస్‌పై మూడు వ్యాక్సిన్లను క్లినికల్ ట్రయల్స్‌కు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది.అందులో తొలి వ్యాక్సిన్‌ కోసం.. గత మార్చి నెల 15వ తేదీనే అనుమతులు పొందింది ఓ సంస్థ. చైనా నేషనల్‌ ఫార్మా స్యూటికల్‌ గ్రూప్‌(సినోఫామ్‌) ఆధీనంలో పనిచేసే వూహాన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ బయొలాజికల్‌ ప్రొడక్ట్స్‌ ‘ఇనాక్టివేటెడ్‌’వ్యాక్సిన్‌ని డెవలప్‌ చేసింది. అంతేకాకంఉడా వూహాన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ(WUIV)కూడా క్లినికల్‌ ట్రయల్స్‌ను స్టార్ట్ చేసినట్లు డ్రాగన్‌ వెల్లడించింది. ఈ విషయాన్ని అక్కడి జిన్‌హువా న్యూస్ ఏజెన్సీ సైతం పేర్కొంది. ప్రస్తుతం తమ వ్యాక్సిన్‌ మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌కి కూడా పంపుతున్నట్లు పేర్కొంది. అయితే ఈ ట్రయల్స్ పూర్తి అయ్యాక.. అది ఎంత సేఫ్టీ అనేది గుర్తించేందుకు కనీసం ఏడాది పడుతుందని సదరు సంస్థ పేర్కొన్నట్లు తెలిపింది.