చెన్నైతోపాటు మరో మూడు జిల్లాల్లో 12 రోజుల లాక్‌డౌన్

| Edited By: Pardhasaradhi Peri

Jun 20, 2020 | 10:30 AM

కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త పద్దతిలో ముందుకు వెళ్తున్నాయి. జిల్లాల వారిగా లాక్‌డౌన్ విధిస్తున్నాయి. కరోనా కట్టడికి తమిళనాడు కూడా అదే తరహాలో ముందుకు సాగుతోంది...

చెన్నైతోపాటు మరో మూడు జిల్లాల్లో 12 రోజుల లాక్‌డౌన్
Follow us on

కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త పద్దతిలో ముందుకు వెళ్తున్నాయి. జిల్లాల వారిగా లాక్‌డౌన్ విధిస్తున్నాయి. కరోనా కట్టడికి తమిళనాడు కూడా అదే తరహాలో ముందుకు సాగుతోంది. తాజాగా చెన్నై నగరంతోపాటు శివారు జిల్లాల్లో పూర్తిస్థాయి లాక్ డౌన్‌కు తెరలేపారు . చెన్నైతోపాటు కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్ పట్టు జిల్లాల్లో కూడా పూర్తి స్థాయి ఆంక్షలతో లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో తమిళనాడు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటిని దాటి బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. పూర్తిస్థాయిలో కర్ఫ్యూను కొనసాగిస్తున్నారు. పోలీసులు డ్రోన్ల సహాయంతో పర్యవేక్షిస్తున్నారు. పెట్రోలింగ్ ను పెంచారు. లాక్ డౌన్ ఆంక్షలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని సూచనలు చేశారు. అత్యవసర సర్వీసులను కూడా రద్దు చేశారు. పోలీసుల అనుమతి ఉంటేనే నగరంలో తిరగడానికి అనుమతి  ఉంటుందని ఆంక్షలు విధించారు.