సిటీ డీసీపీకి కరోనా.. పోలీసుల్లో మొదలైన కలవరం!

| Edited By:

May 05, 2020 | 3:51 PM

దేశంలో కరోనా తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి. అక్కడ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. తాజాగా సోమవారం ఒక్క రోజే 527 మంది వైరస్ బారిన పడ్డారు. అయితే ఇందులో చెన్నై అన్నానగర్ డీసీపీ..

సిటీ డీసీపీకి కరోనా.. పోలీసుల్లో మొదలైన కలవరం!
Follow us on

దేశంలో కరోనా తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి. అక్కడ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. తాజాగా సోమవారం ఒక్క రోజే 527 మంది వైరస్ బారిన పడ్డారు. అయితే ఇందులో చెన్నై అన్నానగర్ డీసీపీ కూడా ఉండటం స్థానిక పోలీసుల్లో కలవరం మొదలైంది. దీంతో చెన్నై పారిశుద్ధ్య విభాగ సిబ్బంది డీసీపీ కార్యాలయ ప్రాంగణాన్ని శానిటైజ్ చేశారు. ఆ డీసీపీ నేతృత్వంలో విధులు నిర్వర్తించిన ఇతర పోలీసులు, సిబ్బందిని ఐసోలేట్ చేశారు. పోలీస్ అధికారితో సన్నిహితంగా ఉన్న వారందరినీ గుర్తించి, వారికి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

కాగా కరోనా లాక్‌డౌన్‌లో భాగంగా.. కోయంబేడు మార్కెట్ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న ఐపీఎస్ స్థాయి అధికారికి సోమవారం కోవిడ్ నిర్థారణ అయ్యింది. రెండు రోజుల నుంచి అనారోగ్యంతో ఉన్న డీసీపీ.. ఆస్పత్రిలో చేరగా కరోనా పరీక్షలో వైరస్ సోకినట్లు తేలింది. కాగా ప్రస్తుతం ఆయన కిల్‌పౌక్ వైద్య ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

Read More:

షాపుల ముందు మందు బాబుల క్యూ లైన్‌ చూసి షాక్‌ అయిన చంద్రబాబు!

పేగులపై కరోనా వైరస్ దాడి.. మళ్లీ ఇదో కొత్త టెన్షన్!