బ్రేకింగ్: సీబీఎస్‌ఈ 10వ తరగతి ఫలితాలు విడుదల..

| Edited By:

Jul 15, 2020 | 1:06 PM

ఈ ఏడాది 18 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. కాగా కరోనా వైరస్ సంక్షోభం కారణంగా CBSE 12వ తరగతి, 10వ తరగతి పరీక్షలను మధ్యలోనే రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఇంటర్నల్ అసెస్‌మెంట్ మార్కుల ఆధారంగా..

బ్రేకింగ్: సీబీఎస్‌ఈ 10వ తరగతి ఫలితాలు విడుదల..
Follow us on

సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలను విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ  ఫలితాలను www.cbseresults.nic, www.cbse.nic.in, cbse.nic.in వెబ్ సైట్స్‌లో చెక్ చేసుకోవచ్చు. అలాగే ఉమాండ్‌ మొబైల్‌ యాప్‌, 011-24300699 టోల్‌ఫ్రీ నంబర్‌ ద్వారా కూడా రిజల్ట్స్‌ తెలుసుకోవచ్చు. కాగా సోమవారమే సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. దీంతో 10వ తరగతి ఫలితాలపై ఉత్కంఠ నెలకొనగా.. రెండు రోజుల గ్యాప్‌తోనే సీబీఎస్‌ఈ 10వ తరగతి రిజల్ట్స్ విడుదలయ్యాయి. ఈ సందర్భంగా ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు కేంద్ర మంత్రి రమేష్ పోక్రియాల్. ఈ ఏడాది 18 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. కాగా కరోనా వైరస్ సంక్షోభం కారణంగా CBSE 12వ తరగతి, 10వ తరగతి పరీక్షలను మధ్యలోనే రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఇంటర్నల్ అసెస్‌మెంట్ మార్కుల ఆధారంగా ఫలితాలను విడుదల చేసింది సీబీఎస్ఈ.

Read More:

హైదరాబాద్‌లో కరోనా జోరు.. హైరిస్క్ ప్రాంతాల్లో కొత్త రూల్స్..

తొమ్మిదిమంది స్టార్ డైరెక్టర్స్‌తో.. వెబ్ సిరీస్‌లోకి హీరో సూర్య..