Coronavirus: అక్కడ టీకా తీసుకోని తండ్రులు పిల్లలతో గడిపే హక్కు కోల్పోతారు..

|

Jan 13, 2022 | 1:16 PM

కరోనాతో ప్రపంచ దేశాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. మూడో వేవ్ ఆందోళనలను నిజం చేస్తూ లక్షలాది కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా ఒమిక్రాన్‌ నుంచి తప్పించుకోవడానికి

Coronavirus: అక్కడ టీకా తీసుకోని తండ్రులు పిల్లలతో గడిపే హక్కు కోల్పోతారు..
Follow us on

కరోనాతో ప్రపంచ దేశాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. మూడో వేవ్ ఆందోళనలను నిజం చేస్తూ లక్షలాది కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా ఒమిక్రాన్‌ నుంచి తప్పించుకోవడానికి పలు దేశాలు కఠిన ఆంక్షలను అమలుచేస్తున్నాయి. వైరస్‌ నుంచి రక్షణ కల్పించేందుకు వీలుగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత ముమ్మరం చేస్తున్నాయి. ఈక్రమంలో టీకా తీసుకోని తల్లిదండ్రులకు పిల్లలతో గడిపే హక్కులేదంటూ కెనడాలోని ఓ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. తండ్రిగా పిల్లలపై అతనికి పూర్తి హక్కులున్నా ప్రస్తుతం పరిస్థితుల్లో పిల్లలను కలిసే అవకాశం మాత్రం లేదంటూ ఆ తీర్పులో పేర్కొంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

కాగా కెనడాకు చెందిన ఓ తండ్రి తన సెలవు రోజుల్లో తన పిల్లలతో ఎక్కువ సమయం గడిపేలా అవకాశం ఇవ్వమంటూ న్యాయస్థానాన్నిఆశ్రయించాడు. అయితే భార్య మాత్రం అతని నిర్ణయాన్ని వ్యతిరేకించింది. ఎందుకంటే అతను అసలు కరోనా టీకా తీసుకోలేదు. దీనికి సాక్ష్యంగా సదరు వ్యక్తి వ్యాక్సిన్‌ తీసుకోలేదంటూ అతను ఫేస్‌బుక్‌, సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్ట్‌లను కోర్టులో చూపించింది. భర్త కోసం తన పిల్లల జీవితాన్ని పణంగా పెట్టలేనని ఆమె న్యాయస్థానం ఎదుట వాపోయింది. ఈ వాదనలు విన్న క్యూబెక్‌ సుపీరియర్‌ కోర్టు న్యాయమూర్తి తండ్రి వ్యాక్సిన్‌ వేసుకోనప్పుడు పిల్లలతో గడిపే హక్కు లేదని తీర్పు చెప్పారు. ప్రస్తుతం ఉన్న ఒమిక్రాన్‌ ఉధృతి నేపథ్యంలో మిగతా పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకునే ఈ ఆదేశాలు జారీ చేసినట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు. అదేవిధంగా వ్యాక్సిన్‌లు తీసుకోనివాళ్ల పై ఆరోగ్య పన్ను విధించాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా ఇప్పటికే వ్యాక్సిన్‌ తీసుకోనివాళ్లను వీధుల్లోకి రానీయకుండా నిషేధించింది కెనడా ప్రభుత్వం.

Also Read:

Coronavirus: కాంగ్రెస్‌లో కరోనా ప్రకంపనలు.. మల్లికార్జున ఖర్గే, వీరప్ప మొయిలీకి పాజిటివ్‌..

Coronavirus: క్రీడల కోసం ఇంతటి క్రూర నిబంధనలా.. విస్తుగొలుపుతోన్న చైనా కరోనా ఆంక్షలు..

వన్‌ప్లస్‌ 10ప్రో బెస్ట్‌ స్మార్ట్‌ఫఫోన్‌ వచ్చేస్తోంది.. అదిరిపోయే ఫీచర్స్‌..!