Kolar Hospital: బ్రిటీష్ కాలం నాటి ఆసుపత్రి.. 20 సంవ‌త్స‌రాలుగా క్లోజ్.. తాజాగా క‌రోనా పేషెంట్స్ కోసం

సుమారు 130 ఏళ్ల పాటు ఎంతో విలువైన బంగారాన్ని అందించిన కేజీఎఫ్ గనులు సరిగ్గా 20 ఏళ్ల క్రితం క్లోజ్ అయ్యాయి. 2001 నుంచి బంగారం తవ్వకాలు నిలిచిపోవడంతో

Kolar Hospital: బ్రిటీష్ కాలం నాటి ఆసుపత్రి.. 20 సంవ‌త్స‌రాలుగా క్లోజ్.. తాజాగా క‌రోనా పేషెంట్స్ కోసం
Kolar Hospital 1

Updated on: May 16, 2021 | 5:54 PM

సుమారు 130 ఏళ్ల పాటు ఎంతో విలువైన బంగారాన్ని అందించిన కేజీఎఫ్ గనులు సరిగ్గా 20 ఏళ్ల క్రితం క్లోజ్ అయ్యాయి. 2001 నుంచి బంగారం తవ్వకాలు నిలిచిపోవడంతో కేజీఎఫ్ ప్రాంతం ప్రస్తుతం వెలవెలబోతోంది. ఇదే క్ర‌మంలో కోలార్ జిల్లా ఆస్ప‌త్రి కూడా మూత‌బ‌డింది. దీన్ని పేద‌వారి ఆస్ప‌త్రి అని పిలిచేవారు. ఈ ఆస్ప‌త్రికి ప్ర‌త్యేక‌మైన చరిత్ర ఉంది. దీనిని 1880 సంవ‌త్స‌రంలో బంగారు గ‌ని కంపెనీని నిర్వ‌హిస్తున్న బ్రిటిష్ అధికారి జాన్ టేల‌ర్ నిర్మించారు. బంగారు గ‌ని లాక్ చేసిన‌ప్ప‌డు.. ఆస్ప‌త్రి కూడా మూత‌బ‌డింది. దాన్ని పునః ప్రారంభించ‌డానికి ఎన్నో ప్ర‌య‌త్నాలు చేసిన‌ప్ప‌టికీ వీలుకుద‌ర‌లేదు. కాగా ప్ర‌స్తుతం క‌రోనా క‌ష్టాలు ఎక్కువ‌వ్వ‌డంతో కేంద్ర గనుల మంత్రి ప్ర‌హ్ల‌ద్ జోషి, ఎంపీ మునిస్వామి ఆస్ప‌త్రిని తిరిగి తెర‌వ‌డానికి అనుమ‌తులు ఇచ్చారు.

ఆసుపత్రిని తిరిగి ప్రారంభించడానికి అనుమతులు రావ‌డంతో వందలాది మంది కేజీఎఫ్ కార్మికులు, బిజెపి కార్యకర్తలు, యువకులు స్వచ్ఛందంగా బంగ్లాను శుభ్రం చేయడానికి, దానికి మెరుగులు దిద్ద‌డానికి  ముందుకు వచ్చారు.

కొద్ది రోజుల్లో ఆసుపత్రి రెడీ…

కోవిడ్ రోగుల‌కు ప్ర‌స్తుతం కేజీఎఫ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అదనంగా, గోల్డ్ మైన్ ఆసుపత్రిని ఏర్పాటు చేసి కోవిడ్ సంరక్షణ కేంద్రంగా మార్చడానికి పనులు జరుగుతున్నాయి. ఆ సమయంలో 800 పడకల సామర్థ్యం ఉన్న ఈ ఆసుపత్రిలో ఇప్పుడు 200 నుండి 300 మంది రోగులకు వసతి కల్పించ‌బోతున్నారు. క‌రోనా సోకిన రోగులకు చికిత్స చేయ‌బోతున్నారు.

రాబోయే పది నుంచి పదిహేను రోజుల్లో మొత్తం ఆసుపత్రి పనులు అయిపోతాయి. దీని తరువాత, ఆసుపత్రికి అవసరమైన వైద్యులు, సిబ్బందిని నియమించనున్నారు. కరోనా కష్టాల కాలంలో ఈ ఆస్ప‌త్రి పునః నిర్మాణం ప‌ట్ల‌ ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఇంత అద్భుతమైన పనికి చొర‌వ తీసుకున్న నాయ‌కుల‌ను ప్ర‌శంసిస్తున్నారు.

Kola Hospital 2

Also Read: భారతదేశంలో పేరు లేని ఏకైక రైల్వే స్టేషన్ ఇదే.. ఎందుకో తెలుసా..

ఈ చేప ధ‌ర బంగారంతో స‌మానం.. దాని కూర చేయ‌డం నేర్చుకోడానికి ఒక జీవితం స‌రిపోద‌ట‌