బ్రెజిల్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 49 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంతకుముంద రోజు 47 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు బ్రెజిల్ వ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 34.5 లక్షలకు చేరింది. బ్రెజిల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం నాడు కొత్తగా మరో 49,298 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు 34,56,652కి చేరింది. ఇక గడిచన 24 గంటల్లో బ్రెజిల్ వ్యాప్తంగా కరోన బారినపడి 1,212 మంది మరణించారు. అంతకుముందు రోజు 1,352 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు బ్రెజిల్ వ్యాప్తంగా కరోనా బారినపడి 1,11,100 మంది మరణించారు. కాగా, ఇప్పటి వరకు బ్రెజిల్ వ్యాప్తంగా కరోనా నుంచి కోలుకుని 2.6 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
Read More :
ఒడిషాలో 70 వేలకు చేరిన పాజిటివ్ కేసులు