కోవిడ్ నిబంధనల ఉల్లంఘన..ఆస్పత్రికి సీల్

|

Jun 25, 2020 | 1:31 PM

లాక్‌డౌన్ సడలింపులు ఇచ్చినప్పటికీ కేంద్రం సూచించిన నిబంధనలు తప్పక పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొవిడ్-19 నిబంధనలను ఉల్లంఘించిన కార్పొరేట్ ఆసుపత్రికి ప్రభుత్వం సీలు వేసిన ఘటన..

కోవిడ్ నిబంధనల ఉల్లంఘన..ఆస్పత్రికి సీల్
Follow us on

దేశవ్యాప్తంగా అన్‌లాక్ 1.0 కొనసాగుతోంది. దీంతో లాక్‌డౌన్ నిబంధనలను చాలా మంది పక్కన పెట్టేస్తున్నారు. లాక్‌డౌన్ సడలింపులు ఇచ్చినప్పటికీ కేంద్రం సూచించిన నిబంధనలు తప్పక పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొవిడ్-19 నిబంధనలను ఉల్లంఘించిన కార్పొరేట్ ఆసుపత్రికి ప్రభుత్వం సీలు వేసిన ఘటన ఒడిశా రాష్ట్రంలోని మాంచెశ్వర్‌లో చోటు చేసుకుంది.

ఒడిశాలోని మాంచెశ్వర్‌లో బ్లూవీల్ ఆస్పత్రిలో జూన్ 23న అధికారులు ఆకస్మీక తనిఖీలు నిర్వహించారు. అక్కడ 27 మంది కరోనా పాజిటివ్ వచ్చిన బాధితులు ఉన్నారు. అయితే, ప్రభుత్వం సూచించిన కొవిడ్-19 నిబంధనల ప్రకారం కరోనా నిర్ధారణ అయిన వారితో కలిసి ఉన్న వారిని గుర్తించి వారికి కూడా కరోనా టెస్టులు చేసి, వారిని కూడా క్వారంటైన్‌ చేయాలి. పాజిటివ్ వచ్చిన వారిని ప్రాంతాన్ని మొత్తం శానిటైజన్ చేయాల్సి ఉంటుంది. వైరస్ ఇతరులకు వ్యాపించకుండా పలు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. కానీ, బ్లూవీల్ ఆస్పత్రి వైద్యాధికారులు మాత్రం ఇవేవీ పట్టించుకోవటం లేదని అధికారులు గుర్తించారు. దీంతో భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఆస్పత్రి యాజమాన్యానికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగానే బ్లూవీల్ ఆస్పత్రికి సీల్ వేసినట్లు వైద్యాధికారులు వెల్లడించారు.

ఒడిశా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 5,470కి పెరిగింది. కరోనా వైరస్ బారినపడి రాష్ట్రంలో 17 మంది మరణించారు. ఈ నేపథ్యంలోనే ఒడిశా సర్కార్ కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. ప్రభుత్వ సూచనలు పాటించని వారిపై తప్పనిసరి చర్యలు తీసుకుంటోంది.