Covid Vaccine: వ్యాక్సినేషన్ (Vaccination) ప్రక్రియలో భారత్ బయోటిక్ కంపెనీ మరో ముందడుగు వేసింది. ఈ కంపెనీ రూపొందించిన చుక్కల మందు బూస్టర్ డోస్ క్లినికల్ పరీక్షల నిర్వహణకు అనుమతిస్తూ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది. ఈ ట్రయల్స్ 900 మందిపై జరపనున్నారు. ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోన్న వేళ ఈ నాజిల్ బూస్టర్ డోస్ ఉపయోగకరంగా ఉంటుందని భారత్ బయోటిక్ భావిస్తోంది.
ఫేజ్3 బూస్టర్ డోస్‌లో భాగంగా చుక్కల మందు టీకాకు డీసీజీఐ నిపుణుల కమిటీ సూత్రప్రాయంగా ఆమోదం ఇచ్చింది. ఈ అనుమతులు పొందిన మొదటి వ్యాక్సిన్ ఇదే కావడం విశేషం. ఇదిలా ఉంటే ఫేస్3 బూస్టర్ డోస్ కోసం దరఖాస్తు చేసుకున్న రెండో కంపెనీగా భారత్ బయోటిక్ నిలిచింది. ఇప్పటికే రెండు డోస్‌ల కోవ్యాక్సిన్, కోవిషీల్డ్ తీసుకున్న వారికి బూస్టర్ డోస్ కింద ఈ చుక్కల మందు అనువైందని భారత్ బయోటిక్ పేర్కొంది.
ఒమిక్రాన్ కేసులు (Omicron) కేసులు పెరుగుతున్న నేపథ్యంలో చుక్కల టీకా పరీక్షలకు అనుమతివ్వాలని భారత్ బయోటిక్ మూడు వారాల కిత్రం దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుత అవసరాల దృష్ట్యా సాధ్యమైనంత త్వరగా చుక్కల మందు టీకాపై ట్రయల్స్ నిర్వహించి, టీకాలను అందుబాటులోకి తీసుకురావాలని భారత్ బయోటిక్ యోచిస్తోంది.
Also Read: Hindupuram: చూడు.. ఇటు వైపే చూడు.. హిందూపురం వైపే చూడు…! కొత్త జిల్లాకు పెరుగుతున్న డిమాండ్
Viral Video: బతకాలంటే ఈ మాత్రం తెగువ ఉండాల్సిందే.. పాము దాడి నుంచి ఎలుక ఎలా తప్పించుకుందో చూడండి.
Nellore District: పొలం పనులు చేస్తుండగా.. బయటపడ్డ 6 బీరువాలు, ఒక బైక్.. ఎంక్వైరీ చేయగా