పశ్చిమ బెంగాల్….ఆ స్వీట్ తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందట..

| Edited By: Pardhasaradhi Peri

Jun 29, 2020 | 9:56 AM

పశ్చిమ బెంగాల్ లో సరికొత్త  స్వీట్ల కోసం తహతహలాడుతున్న ప్రజలకు ఓ శుభవార్త ! ఈ కరోనా కాలంలో మనలో రోగ నిరోధక శక్తిని పెంచే 'ఆరోగ్య సందేశ్' స్వీట్ వచ్ఛేస్తోంది. సుందర్బన్స్ నుంచి తేనెతో తయారు చేసిన ఈ స్వీట్..

పశ్చిమ బెంగాల్....ఆ స్వీట్ తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందట..
Follow us on

పశ్చిమ బెంగాల్ లో సరికొత్త  స్వీట్ల కోసం తహతహలాడుతున్న ప్రజలకు ఓ శుభవార్త ! ఈ కరోనా కాలంలో మనలో రోగ నిరోధక శక్తిని పెంచే ‘ఆరోగ్య సందేశ్’ స్వీట్ వచ్ఛేస్తోంది. సుందర్బన్స్ నుంచి తేనెతో తయారు చేసిన ఈ స్వీట్ ని అనుమతిస్తున్నట్టు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఆవు పాలు , వెన్న, పన్నీర్ తోను, తులసి ఆకుల రసంతోను తయారు చేసిన ఇందులో ఎలాంటి కృత్రిమ పదార్థాలనూ కలపలేదట. ఇది త్వరలో కోల్ కతా లోను, దగ్గరలోని ఇతర జిల్లాల్లోనూ త్వరలో లభ్యమవుతుందని అధికారులు తెలిపారు. ఈ స్వీట్ రోగ నిరోధక శక్తిని మాత్రమే పెంచుతుందని, అంతే తప్ప కరోనా వ్యాధి చికిత్సకు, దీనికి సంబంధం లేదని సుందర్బన్స్ వ్యవహారాల మంత్రి మంతూరాం ఫఖీరా తెలిపారు. సుందర్బన్స్ అడవుల్లోని వివిధ ప్రాంతాల్లో సేకరించిన తేనెతో ఆరోగ్య సందేశ్ తయారవుతోందన్నారు. దీని ధర కూడా సామాన్యుడికి అందుబాటులో ఉంటుందని ఆయన చెప్పారు. ఈ నెలారంభంలో కోల్ కతా లోని ఓ ప్రముఖ స్వీట్స్ తయారీ సంస్థ.. తాము ఇమ్యూనిటీ సందేశ్ పేరిట ఓ స్వీట్ చేస్తున్నామని, ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుందని ప్రకటించుకుంది. అయితే ప్రస్తుత ఆరోగ్య సందేశ్ కి అధికారిక గుర్తింపు లభించడం విశేషం.