రెడ్‌జోన్‌ ప్రాంత ప్రజలకు ఉచితంగా ఆయుర్వేదిక్‌ ఇమ్యూనిటీ బూస్టర్లు

| Edited By:

Jun 12, 2020 | 5:41 PM

జమ్ముకశ్మీర్‌లో ఉన్నరెడ్‌ జోన్‌ ప్రాంతంలో అక్కడి ప్రజలకు రోగ నిరోధక శక్తిని పెంచేలా మందులను పంపిణీ చేయాలని అక్కడి ఆయుష్ డిపార్ట్‌మెంట్‌ నిర్ణయించింది.

రెడ్‌జోన్‌ ప్రాంత ప్రజలకు ఉచితంగా ఆయుర్వేదిక్‌ ఇమ్యూనిటీ బూస్టర్లు
Follow us on

కరోనా మహమ్మారి విజృంబిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే డెబ్బై ఆరు లక్షలకు చేరువలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక మన దేశంలో కూడా దాదాపు మూడు లక్షలకు చేరువలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రస్తుతం రోగ నిరోధన శక్తిని పెంచుకోవడమే ముఖ్యమని.. ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా ఆయుర్వేదిక్‌లో ఉన్న ఇమ్యూనిటీ బూస్టర్లను ప్రజలు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో జమ్ముకశ్మీర్‌లో ఉన్నరెడ్‌ జోన్‌ ప్రాంతంలో అక్కడి ప్రజలకు రోగ నిరోధక శక్తిని పెంచేలా మందులను పంపిణీ చేయాలని అక్కడి ఆయుష్ డిపార్ట్‌మెంట్‌ నిర్ణయించింది. రెడ్‌ జోన్‌లో ఉన్న ప్రాంతాల్లోని ప్రజలకు ఆయుష్ మంత్రిత్వ శాక నుంచి వచ్చిన ఆయుర్వేదిక్‌ ఇమ్యూనిటీ బూస్టర్లను ఉచితంగా అందజేశారు. ఈ ఆయుర్వేదిక్‌ ఇమ్యూనిటీ బూస్టర్లను వాడటం వల్ల ప్రజల్లో రోగనిరోధక శక్తి పెరిగి.. కరోనా వైరస్ సోకినప్పటికీ.. దానిని ఎదర్కోగల శక్తి ఉంటుందని వైద్యులు తెలిపారు.