అస్సాం … లాక్ డౌన్ ఉల్లంఘనకారులనుంచి రూ. 1.50 కోట్లు వసూలు

| Edited By: Pardhasaradhi Peri

Apr 30, 2020 | 5:36 PM

అస్సాంలో లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేస్తున్నారు. ఆంక్షలను ఉల్లంఘించిన 3,449 మందిని పోలీసులు అరెస్టు చేసి.. 21,366 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. లాక్ డౌన్ ను అతిక్రమించిన వారి నుంచి జరిమానాగా రూ. 1.50 కోట్లు వసూలు చేసినట్టు పోలీసు అధికారులు తెలిపారు. ఈ నెల 29 వరకు వేర్వేరు పోలీస్ స్టేషన్లలో మొత్తం 1585 కేసులు నమోదు చేసినట్టు వారు పేర్కొన్నారు. కరోనాపై సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసిన ఓ […]

అస్సాం ... లాక్ డౌన్ ఉల్లంఘనకారులనుంచి రూ. 1.50 కోట్లు వసూలు
Follow us on

అస్సాంలో లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేస్తున్నారు. ఆంక్షలను ఉల్లంఘించిన 3,449 మందిని పోలీసులు అరెస్టు చేసి.. 21,366 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. లాక్ డౌన్ ను అతిక్రమించిన వారి నుంచి జరిమానాగా రూ. 1.50 కోట్లు వసూలు చేసినట్టు పోలీసు అధికారులు తెలిపారు. ఈ నెల 29 వరకు వేర్వేరు పోలీస్ స్టేషన్లలో మొత్తం 1585 కేసులు నమోదు చేసినట్టు వారు పేర్కొన్నారు. కరోనాపై సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసిన ఓ ప్రజాప్రతినిధితో సహా కొందరు సెక్యూరిటీ గార్డులను కూడా అరెస్టు చేశారు. ప్రజల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచేందుకు డ్రోన్లను వినియోగిస్తున్నారు.