Aarogya Setu New Feature: ఆరోగ్య‌సేతులో కొత్త ఫీచ‌ర్‌.. హోమ్ స్క్రీన్‌పై వ్యాక్సినేష‌న్ వివ‌రాలు.. డ‌బుల్ టిక్స్‌తో

|

Jun 07, 2021 | 10:39 AM

Aarogya Setu New Feature: క‌రోనా వైర‌స్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలను అందిస్తూ కేంద్ర ప్ర‌భుత్వం ఆరోగ్య‌సేతు యాప్‌ను తీసుకొచ్చిన విష‌యం తెలిసిందే. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిత్వ ఆధ్వ‌ర్యంలో న‌డిచే ఈ యాప్...

Aarogya Setu New Feature: ఆరోగ్య‌సేతులో కొత్త ఫీచ‌ర్‌.. హోమ్ స్క్రీన్‌పై వ్యాక్సినేష‌న్ వివ‌రాలు.. డ‌బుల్ టిక్స్‌తో
Arogyasetu App Double Tick
Follow us on

Aarogya Setu New Feature: క‌రోనా వైర‌స్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలను అందిస్తూ కేంద్ర ప్ర‌భుత్వం ఆరోగ్య‌సేతు యాప్‌ను తీసుకొచ్చిన విష‌యం తెలిసిందే. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిత్వ ఆధ్వ‌ర్యంలో న‌డిచే ఈ యాప్ ద్వారా దేశవ్యాప్తంగా న‌మోదువుతోన్న కేసుల వివ‌రాలు, యూజర్ల‌కు ద‌గ్గ‌ర్లో ఉన్న కొవిడ్ రోగుల వివ‌రాల‌ను అందిస్తుంది. అయితే త‌ద‌నంత‌రం దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్ ప్ర‌క్రియ మొద‌లైన త‌ర్వాత వ్యాక్సిన్ రిజిస్ట్రేష‌న్ కూడా యాప్ ద్వారా చేసుకునే అవ‌కాశం క‌ల్పించారు.
ఇదిలా ఉంటే తాజాగా ఆరోగ్య సేతు యాప్‌లో మ‌రో కొత్త ఫీచ‌ర్‌ను తీసుకొచ్చారు. ఇప్ప‌టికే ఆఫీసుల్లోకి, ఇత‌ర ప్ర‌దేశాల‌కు అనుమ‌తి కోసం ఆరోగ్య‌సేతు యాప్‌ను చూపిస్తున్న నేప‌థ్యంలో వ్యాక్సినేష‌న్ వివ‌రాల‌ను యాప్‌లో పొంది ప‌రిచారు. స‌ద‌రు యూజ‌ర్ రెండు డోస్‌ల వ్యాక్సిన్ తీసుకున్న‌ట్ల‌యితే.. యాప్‌ హోమ్ స్క్రీన్ డబుల్ బార్డర్‌ను చూపడంతో పాటు, ఆరోగ్య సేతు లోగోలో రెండు బ్లూ టిక్స్ డిస్ ప్లే చేస్తుంది. ఒక వేళ సింగిల్ డోస్ వ్యాక్సిన్ తీసుకుంటే.. వారికి హోమ్ స్క్రీన్‌పై ‘పార్షియల్లీ వ్యాక్సినేటెడ్’ స్టేటస్‌తో పాటు ఒకే టిక్‌తో ఆరోగ్య సేతు లోగో డిస్ ప్లే అవుతుంది.

దీన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే..

* యాప్‌లోకి లాగిన్ కాగానే.. స్క్రీన్‌పై క‌నిపించే ‘అపడేట్ వ్యాక్సినేషన్ స్టేటస్’ క్లిక్ చేయాలి.

* అనంత‌రం రిజిస్ట‌ర్డ్ మొబైల్ నెంబ‌ర్‌ను న‌మోదు చేయాలి.

* వెంట‌నే మొబైల్ నెంబ‌ర్‌కు ఓటీపీ వ‌స్తుంది. దాన్ని ఎంట‌ర్ చేయాలి.

* వ్యాక్సిన్ తీసుకునే స‌మ‌యంలో ఇచ్చిన రిజిస్ట‌ర్ నెంబ‌ర్ వెరిఫై కాగానే.. యాప్‌లో ప్రొఫైల్స్ జాబితా క‌నిపిస్తుంది.

* ప్రొఫైల్‌పై క్లిక్ చేయ‌గానే టీకా స్టేటస్ కొవిన్ బ్యాకెండ్ నుండి నిర్ధారణ అవుతుంది.

* అనంత‌రం ఆరోగ్య సేతు యాప్‌లో వ్యాక్సిన్ వివ‌రాలు అప్‌డేట్ అవుతాయి.

Also Read: Man Death Superstition Treatment: దెయ్యం వదిలిస్తానంటూ చిత్రహింసలు.. యువకుడి ప్రాణం తీసిన మూఢనమ్మకం..

LIC Policy: ప్రతీ నెలా రూ. 3810 డిపాజిట్ చేస్తే.. మీ కూతురు కోసం రూ. 27 లక్షలు పొందొచ్చు.. పూర్తి వివరాలు..

Fact Check: కరీంనగర్‌లో అరుస్తున్న పాము.? అసలు ఇందులో నిజమెంత..