“ఎమెర్జెన్సీ” వార్తలపై ఇండియన్ ఆర్మీ క్లారిటీ..!

| Edited By:

Mar 31, 2020 | 4:20 PM

దేశ వ్యాప్తంగా కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మూడు వారాలపాటు (ఏప్రిల్‌ 14 వరకు) లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 14 తర్వాత సాధారణ పరిస్థితులు ఉంటాయని చెప్పినా.. కొందరు మాత్రం మళ్లీ లాక్‌డౌన్ పొడగించడమే కాకుండా.. దేశంలో ఎమర్జెన్సీ విధిస్తారని సోషల్ మీడియా వేదికగా పుకార్లు సృష్టిస్తున్నారు. ఇక రంగంలోకి ఆర్మీ దిగబోతుందంటూ కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో షికార్లు చేశాయి. ఈ నేపథ్యంలో భారత ఆర్మీ దీనిపై […]

ఎమెర్జెన్సీ వార్తలపై ఇండియన్ ఆర్మీ క్లారిటీ..!
Follow us on

దేశ వ్యాప్తంగా కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మూడు వారాలపాటు (ఏప్రిల్‌ 14 వరకు) లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 14 తర్వాత సాధారణ పరిస్థితులు ఉంటాయని చెప్పినా.. కొందరు మాత్రం మళ్లీ లాక్‌డౌన్ పొడగించడమే కాకుండా.. దేశంలో ఎమర్జెన్సీ విధిస్తారని సోషల్ మీడియా వేదికగా పుకార్లు సృష్టిస్తున్నారు. ఇక రంగంలోకి ఆర్మీ దిగబోతుందంటూ కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో షికార్లు చేశాయి. ఈ నేపథ్యంలో భారత ఆర్మీ దీనిపై స్పందించింది.

కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు.. రాబోయే రోజుల్లో ఎమర్జెన్సీ విధిస్తారని వస్తున్న వార్తలన్నీ ఫేక్ అని తేల్చిపారేశారు. ఈ వైరస్‌ భూతాన్ని ఎదిరించేందుకు మాజీ సైనికులు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ సేవలు కూడా ఉపయోగించుకోవడం లేదని వెల్లడించింది.

కాగా.. చైనాలోని వుహాన్‌ నగరంలో పురుడు పోసుకున్న ఈ కోరనా మహమ్మారి.. ప్రపంచ దేశాలన్నింటిని చుట్టేసిన విషయం తెలిసిందే. మొత్తం ముప్పై ఐదు వేల మంది వరకు ప్రాణాలు కోల్పోగా.. దాదా ఆరు లక్షల మందికి పైగా ఆస్పత్రి పాలయ్యారు. ఇక మనదేశంలో 29 మంది వరకు ప్రాణాలు కోల్పోగా.. వెయ్యి మంది వరకు పాజిటివ్ కేసులతో ఆస్పత్రిలో చికిత్ప పొందుతున్నారు.