AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క‌రోనా ప‌ర్య‌వేక్ష‌కులుగా ఎపికి నిర్మ‌లా, తెలంగాణ‌కు కిష‌న్ రెడ్డి…..

కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం 21 రోజుల లాక్‌డౌన్ విధించింది. చాలా రాష్ట్రాల్లో ఇది విజయవంతంగా అమలవుతోంది. ఈ క్రమంలో వైరస్‌ను ఎదుర్కొనేందుకు తెలుగు రాష్ట్రాల్లో క్షేత్రస్థాయి పరిస్థితిని సమీక్షించేందుకు ఇద్దరు మంత్రులను..

క‌రోనా ప‌ర్య‌వేక్ష‌కులుగా ఎపికి నిర్మ‌లా, తెలంగాణ‌కు కిష‌న్ రెడ్డి…..
Jyothi Gadda
| Edited By: |

Updated on: Mar 27, 2020 | 6:54 PM

Share

కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం 21 రోజుల లాక్‌డౌన్ విధించింది. చాలా రాష్ట్రాల్లో ఇది విజయవంతంగా అమలవుతోంది. ఈ క్రమంలో వైరస్‌ను ఎదుర్కొనేందుకు తెలుగు రాష్ట్రాల్లో క్షేత్రస్థాయి పరిస్థితిని సమీక్షించేందుకు ఇద్దరు మంత్రులను కేంద్రం నియమించింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు కీలక బాధ్యతలు అప్పగించింది. ఇందులో భాగంగా తెలంగాణలోని 33 జిల్లాల అధికారులతో కిషన్ రెడ్డి సంప్రదింపులు జరపనున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలకు చెందిన అధికారులతో సమన్వయం చేసే బాధ్యతను నిర్మల సీతారామన్ తీసుకోనున్నారు. కరోనా పరిస్థితి, సహాయక చర్యలపై నేరుగా అధికారులతో చర్చించి వారిద్దరూ ఎప్పటికప్పుడు వివరాలు సేకరించనున్నారు. వాటి ఆధారంగా అధికారులకు, ప్రభుత్వ యంత్రాంగాలకు తగిన సూచనలు ఇవ్వాలని కేంద్ర మంత్రులను ప్రధాని మోదీ ఆదేశించారు. తెలంగాణలో ఇప్పటి వరకు 59 కేసులు నమోదు కాగా… ఏపీలో 12 మందికి కరోనా వైరస్‌ సోకింది.

Follow Us
పుట్టిన వెంటనే పిల్లలు ఎందుకనీ గుక్కపట్టి ఏడుస్తారు..?
పుట్టిన వెంటనే పిల్లలు ఎందుకనీ గుక్కపట్టి ఏడుస్తారు..?
డ్రగ్ మాఫియా డాన్ మరణంతో అట్టుడుకుతున్న మెక్సికో!
డ్రగ్ మాఫియా డాన్ మరణంతో అట్టుడుకుతున్న మెక్సికో!
చికెన్ తిన్న తర్వాత పొరపాటున కూడా వీటిని తినకండి..
చికెన్ తిన్న తర్వాత పొరపాటున కూడా వీటిని తినకండి..
రమ్యకృష్ణ కొడుకు ఎంట్రీ పై డైరెక్టర్ కృష్ణ వంశీ కామెంట్స్..
రమ్యకృష్ణ కొడుకు ఎంట్రీ పై డైరెక్టర్ కృష్ణ వంశీ కామెంట్స్..
ఇల్లంతా కూల్‌కూల్‌.. ఈ పోర్టబుల్‌ ఏసీని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు
ఇల్లంతా కూల్‌కూల్‌.. ఈ పోర్టబుల్‌ ఏసీని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు
బ్యాంకు లాకర్లో బంగారం మాయమైందా? ఇలా చేస్తే 100 రెట్లు లాభం..
బ్యాంకు లాకర్లో బంగారం మాయమైందా? ఇలా చేస్తే 100 రెట్లు లాభం..
ఇది అగ్ని పరీక్ష.. ఇంట్లో తండ్రి మృతదేహం.. మరోవైపు ఇంటర్ ఎగ్జామ్
ఇది అగ్ని పరీక్ష.. ఇంట్లో తండ్రి మృతదేహం.. మరోవైపు ఇంటర్ ఎగ్జామ్
పెళ్లిలో వింత ఆచారం.. చూస్తే నవ్వు ఆపుకోలేరు..!
పెళ్లిలో వింత ఆచారం.. చూస్తే నవ్వు ఆపుకోలేరు..!
సామాన్యులకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గనున్న వంట నూనె ధరలు!
సామాన్యులకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గనున్న వంట నూనె ధరలు!
వంశీ ఎంతకు తెగించాడు.. మ్యాట్రిమోనిల్ ద్వారా పరిచయం పెంచుకుని..
వంశీ ఎంతకు తెగించాడు.. మ్యాట్రిమోనిల్ ద్వారా పరిచయం పెంచుకుని..