జ‌గ‌న్ స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం…సంతోషంలో స్టూడెంట్స్‌

ఏపీలోనూ క‌రోనా వైర‌స్ లాక్‌డౌన్ అమ‌ల్లో ఉంది. ఈ క్ర‌మంలో సీఎం జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం ప్ర‌క‌టించారు....

జ‌గ‌న్ స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం...సంతోషంలో స్టూడెంట్స్‌
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 26, 2020 | 4:24 PM

కోవిడ్‌- 19ః ఎఫెక్ట్‌తో యావ‌త్ భార‌తావ‌ని స్పందించిపోయింది. దేశ‌వ్యాప్తంగా క‌ర్ఫ్యూవాతావ‌ర‌ణం నెల‌కొంది. దీంతో అన్ని ర‌కాల విద్యాసంస్థ‌లు సైతం మూత‌ప‌డ్డాయి. వార్షిక సంవ‌త్స‌రం ముగింపు సంద‌ర్భంగా విద్యార్థుల‌కు జ‌ర‌గాల్సిన అన్ని ప‌రీక్ష‌లు వాయిదా ప‌డ్డాయి. ఇక‌ ‌ప్ర‌దాని మోది ప్ర‌క‌టించిన లాక్‌డౌన్ ఏప్రిల్ 15 వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. ఈ నేప‌థ్యంలో ఏపీ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. విద్యార్థులు పరీక్షలు రాయకుండానే పై తరగతులకు ప్రమోషన్ కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఏపీలోనూ క‌రోనా వైర‌స్ లాక్‌డౌన్ అమ‌ల్లో ఉంది. ఈ క్ర‌మంలో సీఎం జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం ప్ర‌క‌టించారు. 6 నుంచి 9వ తరగతి విద్యార్థులు పరీక్షలు రాయకుండానే హాజరును బట్టి పై తరగతులకు వెళ్లేలా అవకాశం కల్పించారు. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాకు వెల్ల‌డించారు. అన్ని ప్రైవేట్ స్కూళ్లకు కూడా ఇది వర్తిస్తుందని స్ప‌ష్టం చేశారు. ఇప్ప‌టికే త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం కూడా ప‌రీక్ష‌లు లేకుండానే విద్యార్థుల‌ను పై త‌ర‌గ‌తుల‌కు ప్ర‌మోట్ చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. దేశంలోని చాలా రాష్ట్రాలు కూడా ఇదే బాట‌లో ఉన్నాయి. పరీక్షలు నిర్వహించలేని పరిస్థితుల్లో ఈ నిర్ణయానికి వచ్చాయి.