ఏపీలో మరిన్ని లాక్‌డౌన్ సడలింపులు.. మార్గదర్శకాలు జారీ..

|

May 14, 2020 | 12:49 PM

లాక్ డౌన్ సడలింపులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మరిన్ని వెసులుబాట్లు కల్పించింది. ఈ మేరకు గురువారం అదనపు మార్గదర్శకాలను విడుదల చేసింది. కంటైన్మెంట్, బఫర్ జోన్లు మినహాయించి మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దుకాణాలు తెరిచేందుకు అనుమతులు ఇస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అటు కూరగాయలు, పండ్లు, పాల దుకాణాలు మాత్రం ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు నిర్వహించేందుకు అవకాశం కల్పించింది. ఇక […]

ఏపీలో మరిన్ని లాక్‌డౌన్ సడలింపులు.. మార్గదర్శకాలు జారీ..
Follow us on

లాక్ డౌన్ సడలింపులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మరిన్ని వెసులుబాట్లు కల్పించింది. ఈ మేరకు గురువారం అదనపు మార్గదర్శకాలను విడుదల చేసింది. కంటైన్మెంట్, బఫర్ జోన్లు మినహాయించి మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దుకాణాలు తెరిచేందుకు అనుమతులు ఇస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

అటు కూరగాయలు, పండ్లు, పాల దుకాణాలు మాత్రం ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు నిర్వహించేందుకు అవకాశం కల్పించింది. ఇక షాపింగ్ మాల్స్‌కు అనుమతి లేదన్న ప్రభుత్వం.. గోల్డ్, వస్త్ర, చెప్పుల షాపులను సైతం మూసి ఉంచాలని స్పష్టం చేసింది. కాగా, అన్ని దుకాణాల వద్ద విధిగా హ్యాండ్ శానిటైజర్లు ఉండాలని, మాస్కులు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం తప్పనిసరి అని ఉత్తర్వుల్లో పేర్కొంది.

Read This: హైదరాబాద్‌లో ఉన్నవాళ్లు సొంతూళ్లకు రావొచ్చు.. కానీ