హైదరాబాద్‌లో ఉన్నవాళ్లు సొంతూళ్లకు రావొచ్చు.. కానీ

లాక్‌డౌన్‌ కారణంగా సొంత ఊళ్లకు వెళ్లలేక హైదరాబాద్‌లోనే చిక్కుకుపోయిన ఏపీవాసులకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. వారందరూ కూడా ఏపీకి తిరిగి వచ్చేందుకు ఆర్టీసీ స్పెషల్ సర్వీసులను నడపనుంది. అయితే ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పందన పోర్టల్‌లో అప్లై చేసుకున్నవారికి మాత్రమే ఈ బస్సుల్లో ప్రయాణించే అవకాశాన్ని కల్పించింది. స్వస్థలాలకు చేరుకున్న తర్వాత ఆయా జిల్లాలలోని క్వారంటైన్ కేంద్రాల్లో ఉండేందుకు వారు అంగీకరిస్తేనే బస్సు టిక్కెట్లను జారీ చేస్తారు. కాగా, ఏపీలో వస్తామంటూ హైదరాబాద్ […]

హైదరాబాద్‌లో ఉన్నవాళ్లు సొంతూళ్లకు రావొచ్చు.. కానీ
Follow us

|

Updated on: May 14, 2020 | 8:17 AM

లాక్‌డౌన్‌ కారణంగా సొంత ఊళ్లకు వెళ్లలేక హైదరాబాద్‌లోనే చిక్కుకుపోయిన ఏపీవాసులకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. వారందరూ కూడా ఏపీకి తిరిగి వచ్చేందుకు ఆర్టీసీ స్పెషల్ సర్వీసులను నడపనుంది. అయితే ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పందన పోర్టల్‌లో అప్లై చేసుకున్నవారికి మాత్రమే ఈ బస్సుల్లో ప్రయాణించే అవకాశాన్ని కల్పించింది. స్వస్థలాలకు చేరుకున్న తర్వాత ఆయా జిల్లాలలోని క్వారంటైన్ కేంద్రాల్లో ఉండేందుకు వారు అంగీకరిస్తేనే బస్సు టిక్కెట్లను జారీ చేస్తారు.

కాగా, ఏపీలో వస్తామంటూ హైదరాబాద్ నుంచి 8 వేల మంది, రంగారెడ్డి జిల్లా పరిధిలో 5 వేల మంది స్పందన పోర్టల్లో అప్లయ్ చేసుకున్నారు. వీరందరినీ తీసుకొచ్చేందుకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ సర్వీసులను నడపనుంది. ఈ బస్సులు ప్రయాణీకులను మియాపూర్-బొల్లారం క్రాస్ రోడ్, కూకట్‌పల్లి, హౌసింగ్ బోర్డ్, ఎల్బీనగర్‌లలో ఎక్కించుకుంటుంది. ఇక ఈ సర్వీసులు రెండు లేదా మూడు రోజుల్లో మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన వెలువడిన వెంటనే ఆర్టీసీ ఈ- బుకింగ్ ఓపెన్ చేయనుంది. అటు రెండోదశలో చెన్నై, బెంగళూరులలో ఉండిపోయిన వారిని తీసుకొచ్చేందుకు నడుపనున్నారు.

Read This: తెలంగాణలో జూన్ 3న ఇంటర్ పరీక్షలు..