ఏపీలో రికార్డు స్థాయిలో కేసులు నమోదు.. ఒక్కరోజే 44 మంది మృతి..

| Edited By:

Jul 15, 2020 | 4:23 PM

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. ఇవాళ కొత్తగా 2,432 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. అలాగే ఇవాళ ఒక్క రోజే 44 మంది మృతి చెందారు. అనంతపూర్‌లో తొమ్మిది మంది, పశ్చిమ గోదావరిలో తొమ్మిది మంది..

ఏపీలో రికార్డు స్థాయిలో కేసులు నమోదు.. ఒక్కరోజే 44 మంది మృతి..
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలువురు ప్రజా ప్రతినిధులు, వైద్యులు, పోలీసులు, నటులు కూడా ఈ వైరస్ బారిన పడుతూండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా ఇవాళ  2,432 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. అలాగే బుధవారం ఒక్క రోజే 44 మంది మృతి చెందారు. అనంతపూర్‌లో తొమ్మిది మంది, పశ్చిమ గోదావరిలో తొమ్మిది మంది, కర్నూలులో ఐదుగురు, చిత్తూరులో నలుగురు, తూర్పు గోదావరిలో నలుగురు, విశాఖలో నలుగురు, కడపలో ఇద్దరు, కృష్ణలో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, నెల్లూరులో ఒకరు, శ్రీకాకుళంలో ఒకరు, విజయనగరంలో ఒకరు కోవిడ్‌తో మరణించారు. ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 35,451కి చేరింది. అలాగే ఇప్పటివరకూ 452 మంది మృతి చెందారు. ప్ర‌స్తుతం 16,621 క‌రోనా యాక్టివ్ కేసులు ఉండగా, 18,378 మంది వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

ఇక బుధవారం కొత్తగా నమోదైన కేసుల్లో అనంతపురంలో 162, చిత్తూరులో 257, ఈస్ట్ గోదావరిలో 247, గుంటూరులో 468, కడపలో 112, కృష్ణలో 108, కర్నూలులో 403, నెల్లూరులో 45, ప్రకాశంలో 53, శ్రీకాకుళంలో 178, విశాఖపట్నంలో 123, విజయనగరంలో 49, వెస్ట్ గోదావరిలో 207 కేసులు నమోదయ్యాయి. ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో 22,197 శాంపిల్స్‌ను ప‌రీక్షించ‌గా 2,432 మందికి కోవిడ్ పాజిటివ్ వ‌చ్చింది.

Read More:

కొత్త జిల్లాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం.. కమిటీ ఏర్పాటు..

హైదరాబాద్‌లో కరోనా జోరు.. హైరిస్క్ ప్రాంతాల్లో కొత్త రూల్స్..